తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు ఆంధ్రా షాక్

తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు ఆంధ్రా షాక్ కొడుతోందా? ముఖ్యంగా హైదరాబాద్ శివారుల్లోని మునిసిపాలిటీల్లో బరిలోకి దిగిన అభ్యర్థులకు ఓ వైపు కోడి పందాలు.. మరోవైపు సంక్రాంతి పండుగ టెన్షన్‌గా మారాయి. నామినేషన్ల పర్వం ముగిసినా.. బీ-ఫాం దక్కుతుందో లేదో అన్న టెన్షన్‌లో వున్న అభ్యర్థులకు కొత్తగా పండుగ టెన్షన్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా వున్న మునిసిపాలిటీలకు, మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 22న పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్ల పర్వం జనవరి పదో తేదీన ముగిసినా.. భారీగా […]

తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు ఆంధ్రా షాక్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2020 | 6:44 PM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికలకు ఆంధ్రా షాక్ కొడుతోందా? ముఖ్యంగా హైదరాబాద్ శివారుల్లోని మునిసిపాలిటీల్లో బరిలోకి దిగిన అభ్యర్థులకు ఓ వైపు కోడి పందాలు.. మరోవైపు సంక్రాంతి పండుగ టెన్షన్‌గా మారాయి. నామినేషన్ల పర్వం ముగిసినా.. బీ-ఫాం దక్కుతుందో లేదో అన్న టెన్షన్‌లో వున్న అభ్యర్థులకు కొత్తగా పండుగ టెన్షన్ మొదలైంది.

తెలంగాణ వ్యాప్తంగా వున్న మునిసిపాలిటీలకు, మునిసిపల్ కార్పొరేషన్లకు జనవరి 22న పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నామినేషన్ల పర్వం జనవరి పదో తేదీన ముగిసినా.. భారీగా బరిలో నిలిచిన రెబల్ అభ్యర్థుల నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల బీ-ఫామ్‌ల జారీలో జాప్యం జరుగుతోంది. దాంతో టిక్కెట్ దక్కుతుందా లేదా అన్న టెన్షన్‌‌లో అభ్యర్థులు పడిపోయారు. ఈ అంశానికి జనవరి 14 సాయంత్రానికి గానీ క్లారిటీ రాదు. దాంతో ఆ తర్వాత మిగిలిన ఆరు రోజుల్లో తమ తమ వార్డుల్లోని ఓటర్లందరినీ కలవాలి.. ప్రచారం చేయాలి.. ఇది అభ్యర్థుల షెడ్యూల్.

కానీ, తెలంగాణవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వున్న ఆంధ్రా సెటిలర్లు అత్యంత పెద్ద పండుగగా భావించే సంక్రాంతికి తమ తమ స్వస్థలాలకు వెళుతుంటారు. ఈ సారి అలాగే హైదరాబాద్, శివారు ప్రాంతాల నుంచి సుమారు 30 లక్షల మంది ఏపీలోని తమ స్వస్థలాలకు వెళ్ళారని అంఛనా. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారులో కొత్త ఏర్పాటైన మునిసిపాలిటీలు పెద్ద అంబర్‌పేట్, మణికొండ, తుర్కయంజాల్, నార్సింగి, శంకర్‌పల్లి, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలు… నిజాంపేట, అమీన్‌పూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లలో ఆంధ్ర సెటిలర్లు పెద్ద సంఖ్యలో వున్నారు.

వీరిలో 60-70 శాతం మంది సంక్రాంతికి, కోళ్ళ పందాలకు గానీ తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. 15వ తేదీన సంక్రాంతి, 16న కనుమ.. పోను మధ్యలో శుక్రవారం.. మళ్ళీ శనివారంతో వీకెండ్ మొదలవుతుంది. ఆ తర్వాత ఆదివారం (జనవరి 19న) తర్వాత గానీ వీరంతా హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. కొంతమంది ఇప్పటికే సెటిలర్లను ప్రభావితం చేసేందుకు వారి ప్రాంతాలకు వెళ్ళి వచ్చేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్ టికెట్లను బుక్ చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొంతమంది సెటిలర్ల ఫోన్ నెంబరు తీసుకొని వారితో ఫోన్లలోనే మాట్లాడుతూ ఓట్లు వేయమని అడుగుతున్నారు. వీరిలో చాలా మంది పండగ తర్వాత తిరిగి 20 లేదా 21 తేదీలలోనే నగరానికి చేరుకునే ఛాన్స్ వుంది.

అప్పటికీ మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. తెరచాటు మంతనాలకు కొద్దిపాటి సమయం మిగులుతుంది. ఆ తక్కువ సమయంలో ఎంత మంది సెటిలర్లను కల్వగలం.. ఎందరినీ ఆకర్షించగలం.. ఇదే ఇప్పుడు మునిసిపల్ అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది.