పెన్షనర్లకు మోదీ దీపావళి గిఫ్ట్ అదిరింది..! ఆరువేలకు పైగా పెంపు..!
మోదీ సర్కార్ కేంద్ర ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్‌ను అందించింది. పెన్షనర్లకు 17 శాతం డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ను అందించాలని నిర్ణయిచింది. దీంతో.. డీఆర్ మొత్తం 5 శాతం పెరిగినట్లు అయ్యింది. ఈ డీఆర్ నిర్ణయం 2019 జులై నుంచే వర్తిస్తుంది. కాగా.. ఇది డిసెంబర్ వరకూ అమలులో ఉంటుంది. ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ మొత్తం రూ.450 నుంచి రూ.6,250 మధ్యలో పెరుగుతుంది. అంటే.. మినిమమ్ పెన్షన్ తీసుకునే వారికి […]

మోదీ సర్కార్ కేంద్ర ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్‌ను అందించింది. పెన్షనర్లకు 17 శాతం డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ను అందించాలని నిర్ణయిచింది. దీంతో.. డీఆర్ మొత్తం 5 శాతం పెరిగినట్లు అయ్యింది. ఈ డీఆర్ నిర్ణయం 2019 జులై నుంచే వర్తిస్తుంది. కాగా.. ఇది డిసెంబర్ వరకూ అమలులో ఉంటుంది.
ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ మొత్తం రూ.450 నుంచి రూ.6,250 మధ్యలో పెరుగుతుంది. అంటే.. మినిమమ్ పెన్షన్ తీసుకునే వారికి రూ.450 నుంచి 1000 రూపాయల వరకూ డీఆర్ పెరుగుతోంది. అలాగే.. రూ.1.25 లక్షల పెన్షన్ తీసుకునే వారికి పెన్షన్ మొత్తం రూ.6,250 పెరుగుతుందని చెప్పారు ఏజీ ఆఫీస్ మాజీ ప్రెసిడెంట్ హరిశంకర్ తివారి.
అంతేకాకుండా.. డీఆర్‌తో పాటు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి డియర్‌నెస్ అలవెన్స్ కూడా బాగానే పెరిగింది. డియర్‌నెస్ అలవెన్స్ 5 శాతంను పెంచుతూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీంతో.. డీఏ ఇప్పుడు 17 శాతానికి ఎగసింది. ఈ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం రూ.900 నుంచి రూ,12,500 మధ్యలో పెరుగుతంది. ఈ పెరిగిన డీఆర్, డీఏలతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.