ఫుడ్ మెనులోకి ఆ జాతి కొండచిలువలు.. ఆ దిశలో పరిశోధనలు చేస్తోన్న ఫ్లోరిడా శాస్ర్తవేత్తలు.

కొండ చిలువలను మనసులో తలుచుకుంటేనే భయమేస్తుంది. నేరుగా చూస్తే గుండె బేజారు కావడం ఖాయం. అలాంటిది కొండ చిలువలను తింటే.. ఊహకు కూడా అందట్లేదు కదూ.. కానీ త్వరలోనే ఇది నిజం కానుంది. అయితే ఇది మన దగ్గర కాదులేండి...

ఫుడ్ మెనులోకి ఆ జాతి కొండచిలువలు.. ఆ దిశలో పరిశోధనలు చేస్తోన్న ఫ్లోరిడా శాస్ర్తవేత్తలు.
Narender Vaitla

|

Dec 20, 2020 | 9:44 PM

Burmese pythons can eat: కొండ చిలువలను మనసులో తలుచుకుంటేనే భయమేస్తుంది. నేరుగా చూస్తే గుండె బేజారు కావడం ఖాయం. అలాంటిది కొండ చిలువలను తింటే.. ఊహకు కూడా అందట్లేదు కదూ.. కానీ త్వరలోనే ఇది నిజం కానుంది. అయితే ఇది మన దగ్గర కాదులేండి ఫ్లోరిడా దేశంలో. కొండ చిలువలను (పైథాన్)లను తినొచ్చా అన్న కోణంలో అక్కడి శాస్ర్తవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. బర్మీస్ అనే జాతికి చెందిన పైథాన్లను ఎలాంటి భయం లేకుండా తినొచ్చని శాస్ర్తవేత్తలు భావిస్తున్నారు. ఫ్లోరిడాకు చెందిన ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ కమిషన్.. ఫ్లోరిడా హెల్త్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి బర్సీస్ పైథాన్‌లలో మెర్క్యూరీ స్థాయిలను తెలుసుకునే పనిలో పడింది. ఒకవేళ ఈ జాతి పైథాన్‌లు తినడానికి అనుకూలంగా ఉంటే త్వరలోనే ఫ్లోరిడా రెస్టారెంట్‌లలో అన్ని రకాల మాంసాహారాలతోపాటు పైథాన్ మీట్ కూడా అందుబాటులోకి రానుందని పరిశోధకులు చెబుతున్నారు. దక్షిణ ఫ్లోరిడాలో ఈ పైథాన్‌లు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఇవి అక్కడ ఉండే స్థానిక వన్యప్రాణులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. నిజానికి ఈ పైథాన్‌ ఫ్లోరిడాకు చెందినది కాకపోయినప్పటికీ 1980 నుంచి ఎవర్‌గ్లేడ్స్ అనే ప్రాంతంలో కనిపించడం ప్రారంభమైంది. ఒకవేళ పైథాన్‌లను తింటే ఎలాంటి ప్రమాదం జరగదని పరిశోధకులు నిర్ధారిస్తే వీటికి మించిన రుచి మరొకటి ఉండదని పైథాన్‌లను వేటాడే వారు చెబుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu