AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనవరి 29నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

లోక్‌సభ మొదటి విడత సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి.

జనవరి 29నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Balaraju Goud
|

Updated on: Jan 15, 2021 | 9:33 AM

Share

Union Budget on February 1: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం సమావేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. లోక్‌సభ మొదటి విడత సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా జనవరి 29న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 29 జనవరి నుంచి 15 ఫిబ్రవరి వరకు తొలివిడత సమావేశాలు జరగనుండగా.. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, ఫిబ్రవరి 1న ఉదయం ఈ ఏడాది బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌ను లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు. అయితే చివరిసారిగా సెప్టెంబరులో వర్షాకాల సమావేశాలు ఏడు రోజులపాటే జరిగాయి. కరోనావైరస్ కారణంగా ఆ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతోపాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను సైతం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలపైన ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Read Also… భారత ప్రజాస్వామ్య వైభవం ప్రతిభింబించేలా రాజ్యాంగ మందిరం.. ఇవాళ్టి నుంచి భవన నిర్మాణం పనులు షురూ

వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..
భలే ఛాన్స్.. జిల్లా కోర్టుల్లో 353 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలు
భలే ఛాన్స్.. జిల్లా కోర్టుల్లో 353 ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాలు