Budget 2021: సప్లయ్‌తో కూడిన డిమాండ్ పెరిగితే ఆర్థిక వృద్ది, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోకస్ అదే.

ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ను సమర్పించనున్నారు. కరోనా వైరస్ పరిస్థితి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దాదాపు కుంటుపడింది..

Budget 2021:  సప్లయ్‌తో కూడిన డిమాండ్ పెరిగితే ఆర్థిక వృద్ది, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫోకస్ అదే.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 23, 2021 | 11:30 AM

Budget 2021: ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ను సమర్పించనున్నారు. కరోనా వైరస్ పరిస్థితి కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దాదాపు కుంటుపడింది. అన్ లాక్ అనంతరం సప్లయ్ (సరఫరా) రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేబట్టింది. కానీ డిమాండ్ మాత్రం యధాతథ స్థితిలోనే ఉంది. దీంతో బడ్జెట్ ప్రతిపాదనల్లో డిమాండ్ ను కూడా పెంచాల్సి ఉంది. ఇండియా రేటింగ్స్ రూపొందించిన నివేదికలో దీనికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. కరోనా అనంతరం ఉత్పత్తికి దాదాపు సమానంగా సప్లయ్ కూడా పెరిగిందని ఈ రిపోర్టు పేర్కొంది. కానీ డిమాండ్ స్థితి మాత్రం సేమ్ ! పండుగల సీజన్ కారణంగా ఎకానమీలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ ఆ తరువాత కూడా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ తగ్గినట్టు ఇండియా రేటింగ్స్ ప్రతినిధి సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. డిమాండ్ ను పెంచాలంటే బడ్జెట్ ప్రతిపాదనల్లో కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన అంటున్నారు. ఎకానమీ వృద్ది కోసం లేబర్ రిఫామ్ బిల్లు ( కార్మిక సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లు) ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అలాగే ఉత్పాదక రంగాన్ని మెరుగుపరిచేందుకు దీనితో అనుసంధానించిన ఇన్సెంటివ్ పథకాలను ప్రకటించిందని, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పథకాలకోసం రిలీఫ్ ప్యాకేజీలను కూడా వెల్లడించిందని ఆయన అంటున్నారు.

కానీ ఈ రిలీప్ ఎకానమీలో కనిపించలేదు. బడ్జెట్ ముందరి సమావేశాల్లో మంత్రి నిర్మలా సీతారామన్-ప్రభుత్వం వద్ద కొన్ని అప్షన్స్ ఉన్నాయని, అవసరమైనప్పుడు వాటిని వినియోగిస్తామని చెప్పారు. డిమాండ్ ను పెంచేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్న పక్షంలో జీడీపీ 14 శాతం నామినల్ గా ఉన్న విషయం బోధపడుతుంది. రియల్ జీడీపీ 9.5-10 శాతం, ఆర్ధిక లోటు 6.2 శాతం జీడీపీలో దీనికి సమానంగా ఉండాల్సి ఉంటుంది. అంటే ఆర్ధిక లోటును, జీడీపీని సమానంగా పరిగణించాల్సి ఉంటుంది. హయ్యర్ టాక్స్ రెవెన్యూ, మూలధన వ్యయం, రియల్ ఎస్టేట్ కు బాసట, ఇన్ ఫ్రా పాజెక్టులపై ఎక్కువ వ్యయం వంటి చర్యలు తీసుకోవాలని ఇండియా రేటింగ్స్..సూచిస్తోంది. దీనివల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడింది.

మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?