కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటో – మిని టెంపో ఢీకొని అక్కడికక్కడే బాలుడు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దకడబూరు మండలం మురవణి క్రాస్ సమీపంలో ఆటో - మిని టెంపో ఢీకొనడంతో..
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దకడబూరు మండలం మురవణి క్రాస్ సమీపంలో ఆటో – మిని టెంపో ఢీకొనడంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆటోలో ప్రయాణిస్తోన్న వీరేంద్ర అనే 15ఏళ్ల విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులంతా మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఆటో ఎమ్మిగనూరు నుంచి రచ్చమర్రి గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.