పూమా బ్రాండ్ అంబాసిడర్ గా బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్

పూమా బ్రాండ్ అంబాసిడర్ గా బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్

న్యూఢిల్లీ : ఆరు సార్లు ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఎంసీ మేరికోమ్‌, రెండేళ్ల పాటు ప్రపం చ వ్యాప్తంగా క్రీడా వస్తువులు అందిస్తున్న ప్రముఖ పూమా కంపెనీకి ప్రచార కర్తగా సోమవారం ఎంపికైంది. దేశ వ్యాప్తంగా పూమాకు సంబంధించిన అన్నీ క్రీడా వస్తువులను మేరికోమ్‌ ప్రచారం నిర్వహిస్తుంది. మాగ్నిఫిసెంట్‌ మేరీ’గా ప్రపంచానికి పరిచయం. ఐఓఎస్‌ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అసోసియేషన్‌ మేరికోమ్‌ పేరును ప్రతిపాదించింది. బాక్సర్‌ ఛాంపియన్‌గా, సూపర్‌ మామ్‌గా మేరి కోమ్‌ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 7:29 PM

న్యూఢిల్లీ : ఆరు సార్లు ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఎంసీ మేరికోమ్‌, రెండేళ్ల పాటు ప్రపం చ వ్యాప్తంగా క్రీడా వస్తువులు అందిస్తున్న ప్రముఖ పూమా కంపెనీకి ప్రచార కర్తగా సోమవారం ఎంపికైంది. దేశ వ్యాప్తంగా పూమాకు సంబంధించిన అన్నీ క్రీడా వస్తువులను మేరికోమ్‌ ప్రచారం నిర్వహిస్తుంది. మాగ్నిఫిసెంట్‌ మేరీ’గా ప్రపంచానికి పరిచయం. ఐఓఎస్‌ స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ అసోసియేషన్‌ మేరికోమ్‌ పేరును ప్రతిపాదించింది. బాక్సర్‌ ఛాంపియన్‌గా, సూపర్‌ మామ్‌గా మేరి కోమ్‌ సుపరిచితురాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తల్లులకు రోల్‌ మోడల్‌గా కూడా నిలిచింది. ఈ సందర్భగా మేరీకోమ్‌ మాట్లాడుతూ.. ఒక తల్లిగా, మహిళగా ఎన్నో ఛాలెంజ్‌లను ఎదుర్కొన్నా అని తెలిపింది. ఈ స్థాయిలో ఉండటానికి సహకరించిన కుటుంబ సభ్యులకు, బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. పూమా మంచి కంపెనీ అని, మహిళలను క్రీడల్లో ప్రోత్సహించడంలో, సాయం అందించడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటుందని కొనియాడారు. పూమా కుటుంబంలో మేరికోమ్‌ అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని, భారత్‌లో మహిళల కేటగిరీని మరింత ముందుకు తీసుకెళ్లారని పూమా ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ గంగూలీ తెలిపారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu