కరోనా ఎఫెక్ట్: భారీగా పెరిగిన గేమింగ్ యాప్స్ వినియోగం..!

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఫలితంగా పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం

కరోనా ఎఫెక్ట్: భారీగా పెరిగిన గేమింగ్ యాప్స్ వినియోగం..!
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2020 | 11:02 PM

భారత్ లో కోవిద్ 19 విజృంభణతో వాణిజ్య, ఉత్పాదక​ కార్యకలాపాలు స్తంభించాయి. పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని కోరుతున్నాయి. ఫలితంగా పుస్తకాలు చదవడం, కామిక్స్ చూడడం, గేమింగ్ యాప్స్ వినియోగం ఎక్కువైంది. గత రెండు నెలలుగా మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ దాదాపు 40 శాతం పెరిగినట్టు ఓ నివేదిక వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో దేశం దాదాపు లాక్‌డౌన్ స్థితిలో ఉంది. ఇళ్లకే పరిమితమైన ప్రజలు మొబైల్స్‌కే పరిమితమై న్యూస్, సమాచారం, ఎంటర్‌టైన్మెంట్ వంటి వాటిని అందులోనే వెతుక్కుంటున్నారు. ఈ విషయాన్ని బెంగళూరుకు చెందిన ‘ఇన్‌మోబి గ్రూప్’ నివేదిక వెల్లడించింది.

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కన్జుమర్ ఇన్‌సైట్స్’ పేరుతో పలు విషయాలు వెల్లడించింది. జనవరి తొలి వారం నుంచి ఈ నెల 11 వరకు డేటా సిగ్నల్స్‌ను విశ్లేషించడం ద్వారా ఈ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లొకేషన్ ట్రెండ్స్, వినియోగదారుల ఇన్‌-యాప్ బిహేవియర్‌ను వెల్లడించింది. అది వెల్లడించిన వివరాల ప్రకారం.. బుక్స్, కామిక్ యాప్స్ వినియోగం 200 శాతం పెరగ్గా, గేమింగ్ యాప్స్ వినియోగం 110 శాతం పెరిగింది. ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం 60 శాతం పెరిగింది. మొబైల్ బ్రౌజింగ్ యాప్ యాక్టివిటీ 37 శాతం పెరిగింది. మార్చి 5 నుంచి అయితే ఇమేజ్, వీడియో ఎడిటింగ్ యాప్ వినియోగం రాకెట్ స్పీడ్ అందుకుందని వివరించింది. ఫిబ్రవరి 12 నుంచి గేమింగ్ యాప్‌ల వినియోగం క్రమంగా పెరినట్టు పేర్కొంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు