Books As Dowry : కూతురుకి కట్నంగా ఎడ్లబండి నిండా పుస్తకాలు..

Books As Dowry : “నాన్న నాకు పెళ్లి కానుకగా 50 తులాల బంగారం కావాలి”..”అక్కకి రూ. 10 లక్షలు ఇచ్చి నాకు రూ. 5 లక్షలే ఇస్తున్నావ్”..”పెళ్లి కానుకగా నాకు మంచి కారు కొనివ్వండి”..ఇవి పెళ్లి సందర్భంగా కొంతమంది కూతుర్లు తమ తండ్రులను అడుగుతోన్న కానుకలు. కానీ గుజరాత్ చెందిన ఓ అమ్మాయి పెళ్లి కానుకగా తన తండ్రిని పుస్తకాలు కొనివ్వమని అడిగింది. తాను ఎంత బరువుంటే అంత తూకం వచ్చే విధంగా బుక్స్ కావాలని […]

Books As Dowry : కూతురుకి కట్నంగా ఎడ్లబండి నిండా పుస్తకాలు..
Follow us

|

Updated on: Feb 14, 2020 | 5:46 PM

Books As Dowry : “నాన్న నాకు పెళ్లి కానుకగా 50 తులాల బంగారం కావాలి”..”అక్కకి రూ. 10 లక్షలు ఇచ్చి నాకు రూ. 5 లక్షలే ఇస్తున్నావ్”..”పెళ్లి కానుకగా నాకు మంచి కారు కొనివ్వండి”..ఇవి పెళ్లి సందర్భంగా కొంతమంది కూతుర్లు తమ తండ్రులను అడుగుతోన్న కానుకలు. కానీ గుజరాత్ చెందిన ఓ అమ్మాయి పెళ్లి కానుకగా తన తండ్రిని పుస్తకాలు కొనివ్వమని అడిగింది. తాను ఎంత బరువుంటే అంత తూకం వచ్చే విధంగా బుక్స్ కావాలని కోరింది.  అయితే ఆ తండ్రి తన కూతురు పెళ్లి రోజు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 2200 పుస్తకాలను కొనిచ్చారు. అది కూడా తన కుమార్తె ముందు పెళ్లి రథంపై వెళ్తంటే..వెనుక ఎడ్లబండిలో 2200 పుస్తకాలను నింపి ఊరేగింపుగా తీసుకొచ్చి అందించారు. ఇందుకోసం ఆయన 6 నెలల పాటు కష్టపడ్డారు. వాటిని చూడగానే ఆ పెళ్లి కూతురి ఫేస్ ఆనందంతో వెలిగిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్​ రాజ్​కోట్​కు చెందిన కిన్నరిబా జడేజాకు చిన్నప్పుడు నుంచే పుస్తకాల పురుగుగా పేరుంది. దీంతో తండ్రి హర్దేవ్​ సింహ్​ జడేజాను తన పెళ్లికి పుస్తకాలే పెళ్లి కానుకగా ఇవ్వమని కోరింది. కూతురు అంటే ఎంత ప్రేమో ఆయన ఈ సందర్భంగా చాటుకున్నాడు. ఏకంగా 2200 పుస్తకాలు తీసుకొచ్చి పెళ్లి జరుగుతున్నప్పడు తన కుమార్తెకు బహుకరించాడు.

తాను రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన యువతినని..తమ చేతుల్లో శస్త్రాలతో పాటు శాస్త్రాలు కూడా ఉండాలని కిన్నరిబా జడేజా పేర్కొంది. ప్రజంట్ జనరేషన్‌కి వెపన్స్ కంటే కలం, పుస్తకాల గొప్పదనం ఏంటో తెలియజేయాలని అభిప్రాయపడింది.

తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల2024 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
సమంత హీరోయిన్ అవ్వకముందు ఏం చేసేదో తెలుసా..?
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..చౌకైన ప్లాన్‌తో 28రోజుల వ్యాలిడిటీ!
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
చెన్నైతో ఢీ కొట్టేందుకు సిద్ధమైన సన్‌రైజర్స్ హైదరాబాద్..
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
పెద్దపల్లి బీజేపీలో ముసలం మొదలైంది.. ఏకంగా రోడ్డెక్కి..!
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
అమెరికా పోలీసుల దాష్టికానికి మరో నల్లజాతీయుడు బలి.. వీడియో వైరల్
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు పంపొచ్చు..
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఇదెప్పుడు తీశారు..! ఆర్ఆర్ఆర్‌లాంటి సాంగ్ చిరంజీవి కూడా చేశారా.!!
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
ఎగుమతి నిషేధంలో సడలింపు.. ఈ దేశాలకు ఉల్లి సరఫరాకు గ్రీన్‌సిగ్నల్
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..
8 ఫోర్లు, 2 సిక్సర్లతో కీలక ఇన్నింగ్స్.. కట్‌చేస్తే..