హైకోర్టు సంచలన తీర్పు.. మైనర్ అబార్షన్‌కు అనుమతి…

ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అత్యాచారానికి గురైన ఓ మైనర్ బాలిక తన గర్భాన్ని తొలిగించేందుకు పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం 24 వారాల గర్భంతో ఉన్న ఆ బాలిక తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా తీర్పు వెలువరించింది. గతేడాది జరిగిన అత్యాచారం కారణంగా తన బిడ్డ మానసికంగా కృంగిపోయిందని.. గర్భం తొలగించడం వల్ల తన బిడ్డ చదువుపై శ్రద్ధ పెట్టడానికి వీలు ఉంటుందని సదరు బాలిక తల్లి పిటిషన్‌లో పేర్కొంది. […]

హైకోర్టు సంచలన తీర్పు.. మైనర్ అబార్షన్‌కు అనుమతి...
Follow us

|

Updated on: May 20, 2020 | 9:13 PM

ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అత్యాచారానికి గురైన ఓ మైనర్ బాలిక తన గర్భాన్ని తొలిగించేందుకు పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం 24 వారాల గర్భంతో ఉన్న ఆ బాలిక తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా తీర్పు వెలువరించింది. గతేడాది జరిగిన అత్యాచారం కారణంగా తన బిడ్డ మానసికంగా కృంగిపోయిందని.. గర్భం తొలగించడం వల్ల తన బిడ్డ చదువుపై శ్రద్ధ పెట్టడానికి వీలు ఉంటుందని సదరు బాలిక తల్లి పిటిషన్‌లో పేర్కొంది.

ఈ పిటిషన్‌పై మే 15న విచారణ చేపట్టిన హైకోర్టు.. జెజె హాస్పిటల్ మెడికల్ సిబ్బందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. 17 ఏళ్ల బాలిక తన గర్భాన్ని తొలిగించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంతుందన్న దానిపై నివేదిక సమర్పించాలని కోరింది. 24 వారాల్లో గర్భం తొలిగించడం.. ఆ బాలిక ప్రాణానికి ప్రమాదమని.. కానీ ఆ గర్భాన్ని అలా కొనసాగిస్తే ఆమెకు శారీరికంగా, మానసికంగా ఒత్తిడి కలిగిస్తుందని వైద్య బృందం పేర్కొంది. అందుకే ఆ బాలిక తనకు నచ్చిన హాస్పిటల్‌లో గర్భం తొలిగించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం అని తెలిపారు. దీనితో న్యాయస్థానం ఆ మైనర్ బాలిక అబార్షన్‌కు అనుమతిచ్చింది.

Read More:

షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!

10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..

రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం..

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఓఆర్​ఆర్​పై వాహనాలకు అనుమతి…

మందుబాబులకు గుడ్ న్యూస్.. స్విగ్గీ, జొమాటోలో లిక్కర్ డెలివరీ..

కిమ్‌ను బీట్ చేసిన మోదీ.. ప్రపంచంలోనే మూడోస్థానం..