Star Producer Boney Kapoor: రణబీర్ కపూర్ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న నిర్మాత బోనీకపూర్..!
Star Producer Boney Kapoor: దర్శకుడు అనురాగ్ కశ్యప్, సీనియర్ హీరో అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'AK Vs AK' చిత్రంలో బాలీవుడ్...

Star Producer Boney Kapoor: దర్శకుడు అనురాగ్ కశ్యప్, సీనియర్ హీరో అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘AK Vs AK’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. దీనితో ప్రస్తుతం బహుళ భాషలలో నిర్మాతగా పలు చిత్రాలు నిర్మిస్తూ బిజీగా ఉన్న బోనీ కపూర్‌కు ఇప్పుడు నటుడిగా కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే లవ్ రంజన్ దర్శకత్వంలో స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రంలో బోనీ కపూర్ తండ్రి పాత్రలో నటించనున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారని బీ-టౌన్ వర్గాలు చెబుతున్నాయి.




