AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రానాను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించిన బాలీవుడ్ హీరోయిన్

బాహుబలి భల్లాల దేవుడు అలియాస్ రానా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ మేరకు రానా దగ్గుబాటి తండ్రి సురేశ్ బాబు తాజాగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రానా, మిహీకా బజాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా...

రానాను తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించిన బాలీవుడ్ హీరోయిన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 13, 2020 | 5:52 PM

Share

బాహుబలి భల్లాల దేవుడు అలియాస్ రానా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ మేరకు రానా దగ్గుబాటి తండ్రి సురేశ్ బాబు తాజాగా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రానా, మిహీకా బజాజ్ అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. దీంతో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటిని తమ ఫ్యామిలీలోకి ఆహ్వానించారు బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్. అందులోనూ రానానే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమ్మాయిని పరిచయం చేయడంతో సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఒక్కసారిగా రానాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ కూడా ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరిపోయారు.

ఈ మేరకు ఈ విషయంపై ఆమె స్పందిస్తూ.. ‘మిహీకా, రానాలకు అభినందనలు తెలుపుతూ.. డార్లింగ్ బేబీ మిహీక.. నీకు శుభాకాంక్షలు. లవ్ యూ సో మచ్. రానా నిన్ను సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు. మా కుటుంబాలోకి నీకు స్వాగతం రానా అంటూ విష్ చేశారు సోనమ్ కపూర్’. కాగా సోనమ్, మిహీకాలు మంచి స్నేహితులు. ఒకరికి సంబంధించిన వేడుకల్లో మరొకరు పాల్గొంటూ ఉంటారు. అంతేకాదు ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

Read More:

రానా, మిహీకాల పెళ్లి ఎప్పుడో చెప్పేసిన సురేష్ బాబు

బస్సుల్లో మారిన సీట్లు.. ఏపీఎస్‌ఆర్టీసీ‌లో కొత్త మోడల్

రెండో భార్యతో దిల్ రాజు ఫస్ట్ సెల్ఫీ.. వైరల్ అవుతున్న పిక్

Follow Us