భారీ ఆర్థిక ప్యాకేజీలో మరిన్ని వరాల వెల్లువ

భారీ ఆర్థిక ప్యాకేజీలో మరిన్ని వరాల వెల్లువ

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలోని ముఖ్యాంశాలను వివరించిన ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. మరిన్ని వరాల గురించి ప్రస్తావించారు. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్ఛే ఎంఎస్ఎంఈలకు పీఎఫ్ (భవిష్యనిధి) ని మరో మూడు నెలలు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. జూన్, జులై, ఆగస్టు నెలల పీఎఫ్ మొత్తం రూ. 2,500 కోట్లను కేంద్రమే భరిస్తుందనిఅన్నారు. ఉద్యోగులు నెల నెలా చెల్లించే ఈ పీ ఎఫ్ ను 12 నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నామని అన్నారు. […]

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

May 13, 2020 | 7:23 PM

ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీలోని ముఖ్యాంశాలను వివరించిన ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. మరిన్ని వరాల గురించి ప్రస్తావించారు. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్ఛే ఎంఎస్ఎంఈలకు పీఎఫ్ (భవిష్యనిధి) ని మరో మూడు నెలలు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. జూన్, జులై, ఆగస్టు నెలల పీఎఫ్ మొత్తం రూ. 2,500 కోట్లను కేంద్రమే భరిస్తుందనిఅన్నారు. ఉద్యోగులు నెల నెలా చెల్లించే ఈ పీ ఎఫ్ ను 12 నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నామని అన్నారు.

టీడీఎస్, టీసీఎస్ ను 25 శాతం తగ్గించడం వల్ల ప్రజలకు 50 వేల కోట్ల లబ్ది కలుగుతుందని ఆమె చెప్పారు. ఈ తగ్గింపు రేపటి నుంచే అంటే గురువారం నుంచే వర్తించి వచ్ఛే ఏడాది మార్చి 31 వరకు అమలులో ఉంటుందన్నారు. బిజినెస్ లు, వర్కర్లకు ఈ పీ ఎఫ్ కంట్రిబ్యూషన్ ను మూడు నెలల వరకు తగ్గిస్తున్నామంటే ఇది 10 శాతమని, ఈ చర్య వల్ల ఈపీఎఫ్ఓ కింద గల సుమారు 6.5 లక్షల సంస్థలకు, 4.3 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. వందమంది ఉద్యోగులు గల కంపెనీలకు రెండు త్రైమాసికాల ఈపీఎఫ్ ను కేంద్రం చెల్లిస్తుంది..90  శాతం స్టాఫ్ ఉంటే నెలకు 15 వేలు లభిస్తుంది.. మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఈ పీ ఎఫ్ అకౌంట్లలో ప్రభుత్వం 12 శాతం యాజమాన్యం, 12 శాతం ఉద్యోగుల కంట్రిబ్యూషన్ చెల్లింపులను జరిపింది. దీన్ని మరో మూడు నెలలకు.. అంటే జూన్, జులై, ఆగస్టు నెలలకు పొడిగిస్తున్నాం అని నిర్మలా సీతారామన్ వివరించారు.

రెరా పరిధిలోకి వచ్ఛేరియల్ ఎస్టేట్ కంపెనీలకు ఊరట కల్పించేందుకు రెరా నిబంధనల ప్రకారం.. భవనాల నిర్మాణం, ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లకు సమయాన్ని ఆరు నెలల వరకు పొడిగిస్తున్నామని, అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోని కాంట్రాక్టులన్నీ 6 నెలల వరకు పొడిగిస్తున్నట్టే అని నిర్మల పేర్కొన్నారు. ఇంకా ఎన్ బీ ఎఫ్ సీ లకు 45 వేల కోట్ల పాక్షిక గ్యారంటీ ఇస్తామని, పెద్ద ఎత్తున బకాయిలు పడిన విద్యుత్ డిస్కం లకు రూ. 90 వేల కోట్ల నగదు లభ్యత కల్పిస్తామని ఆమె అన్నారు. పన్ను రిటర్నుల తేదీని జులై 31 నుంచి నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu