AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనో డైరెక్టర్..నడిపేది మాత్రం సెక్స్ రాకెట్..

సినిమా..ఈ పేరులోనే ఓ మానియా ఉంది. అంతే స్థాయిలో మాయ కూడా ఉంది. సినిమాల్లో నటించాలని, టెక్నిషియన్లుగా రాణించాలని ఎంతోమంది నగరాలకు వస్తూ ఉంటారు. వాళ్ల అమాయకత్వాన్ని, అవసరాన్ని, ఆకలిని..అడ్డు పెట్టుకోని కొందరు ప్రబుద్దులు చెలరేగిపోతున్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తినే మీకు పరిచయం చేయబోతున్నాం. సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ పనిచేస్తారు. అంటే మూవీలోని పాత్రలకు కావాల్సిన నటీనటులను దర్శక,నిర్మాతలకు పరిచయం చేస్తుంటారు. అలా చేసింనందుకు కొంత డబ్బులు ఛార్జ్ చేస్తారు. తప్పు లేదు. కూటి కోసం కోటి […]

అతనో డైరెక్టర్..నడిపేది మాత్రం సెక్స్ రాకెట్..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jan 16, 2020 | 10:59 AM

Share

సినిమా..ఈ పేరులోనే ఓ మానియా ఉంది. అంతే స్థాయిలో మాయ కూడా ఉంది. సినిమాల్లో నటించాలని, టెక్నిషియన్లుగా రాణించాలని ఎంతోమంది నగరాలకు వస్తూ ఉంటారు. వాళ్ల అమాయకత్వాన్ని, అవసరాన్ని, ఆకలిని..అడ్డు పెట్టుకోని కొందరు ప్రబుద్దులు చెలరేగిపోతున్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తినే మీకు పరిచయం చేయబోతున్నాం. సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్స్ పనిచేస్తారు. అంటే మూవీలోని పాత్రలకు కావాల్సిన నటీనటులను దర్శక,నిర్మాతలకు పరిచయం చేస్తుంటారు. అలా చేసింనందుకు కొంత డబ్బులు ఛార్జ్ చేస్తారు. తప్పు లేదు. కూటి కోసం కోటి విద్యలు. అలానే నవీన్‌ కుమార్‌ ప్రేమ్‌లాల్‌ అనే వ్యక్తి బాలీవుడ్‌లో బడా సినిమాలకు క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే మనోడికి ఓ సైడ్ బిజినెస్ కూడా ఉంది.  ఇండస్ట్రీ వచ్చే యువతులను ట్రాప్ వారిని వ్యభిచార రొంపిలోకి దింపడం. మరో ఇద్దరు స్నేహితులు అజయ్‌ శర్మ, విజయ్‌లతో కలిసి గత ఐదేళ్లుగా ఈ చీకటి వ్యాపారాన్ని దర్జాగా సాగిస్తున్నాడు ఈ కేటుగాడు.

అతడి వలలో చిక్కుకోని మోసపోయిన ఓ యువతి పోలీసులకు విషయాన్ని చేరవేసింది. ఖాకీలు అతడి రూట్‌లోని గుట్టు రట్టు చేశారు. బయటి వ్యక్తుల్లా ఫోన్ చేసి తమకు అమ్మయిలు కావాలని అడిగారు. అంతే అస్సలు ఆలస్యం లేకుండా.. ‘సినిమాల్లో చేసే అమ్మాయిలు రేటు కాస్త ఎక్కువ ‘ ఫోటోలు పంపాడు ప్రేమ్‌లాల్‌. ఒక్కో యువతికి రూ. 60 వేలు అవుతోందని, హెటల్ ఖర్చులు మీరే భరించాలని చెప్పాడు. పోలీసులు సరే అన్నారు. చెప్పిన టైంకి యువతులతో కలిసి హోటల్‌లో వాలిపోయాడు అతడు. పోలీసులు కూడా గేమ్ ప్లాన్ అమలుచేసి సదరు కేటుగాడ్ని సెల్‌లో పడేశారు. ఇద్దరు యువతుల్ని విచారించి, వారిని రెస్క్యూ హోంకు తరలించారు.

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..