Boiled Egg vs Omelette: ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్? ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందంటే..

గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్.. రోజూ ఒక గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని ప్రభుత్వమే చెబుతోంది. పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునేవారు గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే గుడ్డుని కూరల్లో, బిర్యానీ, ఫ్రైగానే కాదు ఉడక బెట్టి, ఆమ్లెట్ వేసుకుని ఇలా రకరకాలుగా తింటారు. అయితే ఉడకబెట్టిన గుడ్డు, లేదా ఆమ్లెట్ ని ఎక్కువగా తింటారు. ఈ రెండితో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకుందాం..

Boiled Egg vs Omelette: ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్? ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందంటే..
Boiled Egg Vs Omelette
Follow us
Surya Kala

|

Updated on: Dec 27, 2024 | 8:36 AM

గుడ్డు పోషకాలు సమృద్ధిగా ఉన్న ఒక సూపర్ ఫుడ్ . అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. గుడ్డు బరువు తగ్గడం నుంచి కండరాలను ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం వరకు అనేక విధాలుగా ప్రయోజనాలను కలిగిస్తుంది. గుడ్డుని ఉడికించి, వేయించిన గుడ్డు లేదా ఆమ్లెట్ ఇలా రకరకాలుగా తింటారు. ఉడికించిన గుడ్లు , ఆమ్లెట్‌లో ఏది మంచిది అంటే అది ఆహారపు అలవాట్లు, ఫిట్‌నెస్ లక్ష్యాలు, అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్ ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిది అని ఆలోచిస్తుంటే.. ఈ రోజు సమాధానం తెలుసుకుందాం..

ఉడికించిన గుడ్ల ప్రయోజనాలు

తక్కువ కేలరీలు: ఉడకబెట్టిన గుడ్లలో నూనె లేదా నెయ్యి ఉపయోగించరు. దీని కారణంగా కేలరీలు తక్కువగా ఉంటాయి. కనుక ఉడకబెట్టిన గుడ్డు ఆరోగ్యానికి మంచిది.

పోషకాహారం: ఉడికించిన గుడ్లలో ప్రోటీన్, విటమిన్ డి, బి12 , ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల ఇది మంచి ఎంపిక.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడంలో సహాయకారి: తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్ కారణంగా ఉడికించిన గుడ్డు బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

త్వరగా రెడీ చేసుకోవచ్చు: ఇది తయారు చేయడం చాలా సులభం. వేగంగా రెడీ చేసుకోవచ్చు. అందుకే చాలా మంది ఉడకబెట్టిన గుడ్లను తినడానికి ఇష్టపడతారు.

ఆమ్లెట్ ప్రయోజనాలు

టేస్టీ , వెరైటీ: చాలా మంది ఆమ్లెట్ తినడానికి ఇష్టపడతారు. గుడ్లు కొట్టిన తర్వాత దానికి ఉప్పు, కారం, మసాలా దినుసులు జత చేసి తయారుచేస్తారు. దీనికి టమోటా, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పాలకూర వంటి వాటిని కూడా జోడించి కూడా భిన్నమైన రుచిలో తయారు చేసుకోవచ్చు. స్పైసీ ఫుడ్‌ను ఇష్టపడే వారు ఆమ్లెట్‌ను ఇష్టపడతారు. ఉడకబెట్టిన గుడ్ల మాదిరిగానే ఆమ్లెట్‌లో కూడా చాలా పోషకాలు ఉంటాయి.

రెండిటిలో ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనదంటే

బరువు తగ్గడం కోసం: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే.. ఉడికించిన గుడ్డులో తక్కువ కేలరీలు ఉంటాయి. నూనె లేదా వెన్న లేకుండా తయారు చేస్తారు కనుక ఇది ఆరోగ్యానికి మంచిది.

రుచి కోసం: ఉడికించిన గుడ్డు కంటే గుడ్డు రుచిగా ఉండాలనుకుంటే ఆమ్లెట్‌ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఆమ్లెట్ కు కూరగాయలను జోడించడం ద్వారా పోషకాహారంగా మారుతుంది. రుచిగా ఉంటుంది.

వ్యాయామం, జిమ్ చేసేవారికి: రోజూ వ్యాయామం చేస్తున్నా లేదా శారీరకంగా చాలా చురుగ్గా ఉండాలంటే ఆమ్లెట్ తినడానికి సరైనది కావచ్చు. ఎందుకంటే ఇందులో శక్తిని ఇచ్చే కొవ్వులు ఉంటాయి. ఇది రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

అవసరాన్ని బట్టి: గుడ్డు లేదా ఆమ్లెట్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుందా అనేది ప్రతి వ్యక్తి శరీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల బరువు తగ్గడానికి లేదా ఏదైనా నిర్దిష్ట లక్ష్యం కోసం గుడ్లు తింటుంటే.. ఈ విషయంపై పోషకాహార నిపుణుడిని సంప్రదించాలి. మీ శారీరక అవసరానికి అనుగుణంగా గుడ్లు తినడానికి సరైన మార్గం, సమయం గురించి సరైన సమాచారాన్ని అందిస్తారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..