ఈ జలపాతం చూస్తే.. “నయాగరా” చూసినట్లే..!

నయాగార… ప్రపంచంలో అందమైన, అతిపెద్ద జలపాతం.. అయితే ఇది చూడాలంటే విమానమెక్కి.. అమెరికా వెళ్లాలి. కానీ అలాంటి జలపాతాన్ని తక్కువ ఖర్చుతోనే చూడొచ్చు. నయాగరా అంతా కాకున్నా.. దాదాపుగా అంతే ఆనందం కలిగించే జలపాతం.. మన తెలంగాణలోనే ఉంది. అదే బొగతా జలపాతం. దీనికి తెలంగాణ ‘నయాగర’గా గుర్తింపు. ఇది ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఉంది. కాళేశ్వరం-భద్రాచలం అడవుల మధ్యన ఉంది. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి వాగు నీళ్లు దుంకి కింద […]

ఈ జలపాతం చూస్తే.. నయాగరా చూసినట్లే..!
Follow us

| Edited By: seoteam.veegam

Updated on: Sep 27, 2019 | 3:48 PM

నయాగార… ప్రపంచంలో అందమైన, అతిపెద్ద జలపాతం.. అయితే ఇది చూడాలంటే విమానమెక్కి.. అమెరికా వెళ్లాలి. కానీ అలాంటి జలపాతాన్ని తక్కువ ఖర్చుతోనే చూడొచ్చు. నయాగరా అంతా కాకున్నా.. దాదాపుగా అంతే ఆనందం కలిగించే జలపాతం.. మన తెలంగాణలోనే ఉంది. అదే బొగతా జలపాతం. దీనికి తెలంగాణ ‘నయాగర’గా గుర్తింపు. ఇది ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లిలో ఉంది. కాళేశ్వరం-భద్రాచలం అడవుల మధ్యన ఉంది. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి వాగు నీళ్లు దుంకి కింద పెద్ద జలాశయంగా ఏర్పడుతాయి. పచ్చని దట్టమైన అడవుల మధ్య కొండకోనల్లో నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఈ బొగత.

అయితే ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే.. కొత్తగూడెం నుంచి భద్రాచలం మీదుగా వాజేడుకు వెళ్లాలి. వాజేడు నుంచి 5 కిలోమీటర్ల దూరంలో చీకుపల్లి కాజ్‌వే ఉంటుంది. అక్కడ్నుంచి మరో మూడు కిలోమీటర్లు వెళ్తే.. బొగత జలపాతం వస్తుంది. ఇక ఖమ్మం నుంచి అయితే 240 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఇక హైదరాబాద్‌కు 440 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నగరం నుంచి ఖమ్మం, వరంగల్, భూపాలపల్లి మీదుగా వెళ్లవచ్చు. ఏటూరు నాగారం నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంతేకాకుండా అటు భద్రాచలం నుంచి కూడా బొగత జలపాతంకు చేరవచ్చు. అక్కడి నుంచి 120 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

అయితే బొగతా అందాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పర్యాటకులు వెళ్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో ఇక్కడ ఎక్కువ రద్దీ ఉంటుంది. ఎగువ మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే.. బొగత జలపాతం ఉరకలెత్తుతుంది. సో మీరు కూడా ఈ తెలంగాణ నయాగర చూసి.. అమెరికా నయాగరను చూసిన అనుభూతిని పొందండి.