ఈ రాత్రి నీలి రంగులో చంద్రుడి దర్శనం(బ్లూ మూన్)

ఆకాశానికి అందం చందమామ. ప్రశాంతతకు చిహ్నం పండు వెన్నెల. రోజూ చూసే ఆ చంద్రుడు ఒక్కసారిగా రంగు మారిపోతే? కురుస్తున్న ఆ వెన్నెలకు కొత్త భాష్యాలు చెబితే.. ! ఎస్‌.. అదే బ్లూమూన్‌. నిండాకాశంలో ఈ రాత్రి కనిపించబోతున్న కలర్‌ఫుల్‌ ఈవెంట్‌ ఇది. నేడు 2020.. అక్టోబర్ 31.. డైరీలో రాసుకోవాల్సిన రోజు. ఎందుకంటే అదనంగా వచ్చే పున్నమి కూడా. రోజూ మనం చూసే చంద్రుడి రంగు కాస్త దవళ వర్ణ శోభితం. కానీ ఇప్పుడు కనిపించబోతోంది.. […]

ఈ రాత్రి నీలి రంగులో చంద్రుడి దర్శనం(బ్లూ మూన్)
Follow us

|

Updated on: Oct 31, 2020 | 3:09 PM

ఆకాశానికి అందం చందమామ. ప్రశాంతతకు చిహ్నం పండు వెన్నెల. రోజూ చూసే ఆ చంద్రుడు ఒక్కసారిగా రంగు మారిపోతే? కురుస్తున్న ఆ వెన్నెలకు కొత్త భాష్యాలు చెబితే.. ! ఎస్‌.. అదే బ్లూమూన్‌. నిండాకాశంలో ఈ రాత్రి కనిపించబోతున్న కలర్‌ఫుల్‌ ఈవెంట్‌ ఇది. నేడు 2020.. అక్టోబర్ 31.. డైరీలో రాసుకోవాల్సిన రోజు. ఎందుకంటే అదనంగా వచ్చే పున్నమి కూడా. రోజూ మనం చూసే చంద్రుడి రంగు కాస్త దవళ వర్ణ శోభితం. కానీ ఇప్పుడు కనిపించబోతోంది.. స్వల్ప నీలిరంగు. మరి కాంతిలో కూడా తేడా ఉంటుందా అంటే.. పురణాల ప్రకారం ఇది శరత్‌పూర్ణిమ. చంద్రుడు 16 కళలలనూ ప్రదర్శించే రోజు. ఆ సమయంలో వెలువడే అమృతమయ కాంతికి ఔషధతత్వం ఉంటుందట. మనసును చంద్రుడితో పోల్చుతారు. అందుకే.. మానసిక, రుగ్మతలనే కాదు.. శారీరక జబ్బులనూ తగ్గించే శక్తి.. ఇవాళ్టి చంద్రుడికి, చంద్రకాంతికి ఉందన్నది కొందరి వాదన. బ్లూ మూన్ అదృష్టమైతే ఫర్వాలేదు.. కానీ అరిష్టం అన్న వాదన కూడా లేకపోలేదు. పాశ్చాత్య దేశాల్లో చెప్పేదాన్ని బట్టి బ్లూమూన్ వేళలో నక్కలు ఆ వైపే చూసి ఊలలు వేస్తాయట. వాతావరణ నీలి, నలుపు రంగులోకి మారుతుందట. అగ్నిపర్వతాలు బద్దలవడం, సముద్రం ఉప్పొంగటం వంటి వైపరిత్యాలు జరుగుతాయన్నది వెస్ట్రన్‌ వెర్షన్‌.