మహారాష్ట్రలో ఇక బీజేపీ-శివసేన ప్రభుత్వం !

మహారాష్ట్రలో ఇక బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. శివసేన నేత సంజయ్ రౌత్ తనను కలిసి గంట గడిచీ గడవకముందే బుధవారం ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ మీడియా వద్ద ఈ విషయం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రయత్నాలు చేయదని ఆయన చెప్పారు. మేం ప్రతిపక్షంలో కూర్చుంటాం అని పేర్కొన్నారు. ప్రజలు ఇఛ్చిన తీర్పును గౌరవించి బీజేపీ-శివసేన త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మేం ప్రతిపక్ష […]

మహారాష్ట్రలో ఇక బీజేపీ-శివసేన ప్రభుత్వం !

మహారాష్ట్రలో ఇక బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పాటు కానుంది. శివసేన నేత సంజయ్ రౌత్ తనను కలిసి గంట గడిచీ గడవకముందే బుధవారం ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ మీడియా వద్ద ఈ విషయం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రయత్నాలు చేయదని ఆయన చెప్పారు. మేం ప్రతిపక్షంలో కూర్చుంటాం అని పేర్కొన్నారు. ప్రజలు ఇఛ్చిన తీర్పును గౌరవించి బీజేపీ-శివసేన త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మేం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అని మరోసారి చెప్పారాయన. ప్రభుత్వ ఏర్పాటులో తమ పాత్ర ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ-సేన 30 ఏళ్లుగా పొత్తు పెట్టుకున్నాయని, రేపో, మాపో వారు మళ్ళీ కలిసిపోతారని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ-సేన నేతలు సమావేశమై.. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. మహారాష్ట్ర అసెంబ్లీ కాల పరిమితి ఈ నెల 8 తో ముగియనుంది. ఈ లోగా ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఇక రాష్ట్రపతి పాలనే శరణ్యమని ఇదివరకే వార్తలు వఛ్చిన సంగతి విదితమే.