బీజేపీ ఆఫీసు బేరర్ల పునర్వ్యవస్థీకరణ, రామ్ మాధవ్ కు ‘స్దాన చలనం’!
బీజేపీలో పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డా సంస్ధాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆఫీసు బేరర్లను మార్చారు. రామ్ మాధవ్, పి.మురళీధర రావు, అనిల్ జైన్, సరోజ్ పాండే వంటి ప్రధాన కార్యదర్శలను..
బీజేపీలో పార్టీ అధ్యక్షుడు జేపీ. నడ్డా సంస్ధాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆఫీసు బేరర్లను మార్చారు. రామ్ మాధవ్, పి.మురళీధర రావు, అనిల్ జైన్, సరోజ్ పాండే వంటి ప్రధాన కార్యదర్శలను తొలగించి వారి స్థానే కొత్తవారిని నియమించారు. కర్నాటక నుంచి ఎంపీ తేజస్వి సూర్యకు పార్టీ యువజన విభాగం… యువమోర్చా అధ్యక్షపదవినిచ్చారు. మరో ఎంపీ అనిల్ బలూనీ ని మీడియా ఇన్-చార్జిగా కొనసాగిస్తూనే పార్టీ ప్రధాన అధికారప్రతినిధిగా నియమించారు.