నేడు బెజవాడ సాక్షిగా బీజేపీ-జనసేన భేటీ
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓ వైపు మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్‌గా కొనసాగుతుంటే.. మరోవైపు జనసేన-బీజేపీ భేటీతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీ వెళ్లి బీజేపీ అధినాయకులను కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందని కొందరు.. విలీనం చేయబోతున్నారని మరికొందరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే ఇరు పార్టీల భేటీపై ఆసక్తినెలకొంది. ఇవాళ జరగబోయే సమావేశం తరువాత.. […]
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓ వైపు మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్‌గా కొనసాగుతుంటే.. మరోవైపు జనసేన-బీజేపీ భేటీతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఢిల్లీ వెళ్లి బీజేపీ అధినాయకులను కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోబోతుందని కొందరు.. విలీనం చేయబోతున్నారని మరికొందరు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే ఇరు పార్టీల భేటీపై ఆసక్తినెలకొంది. ఇవాళ జరగబోయే సమావేశం తరువాత.. జనసేన కాషాయసేనగా మారుతుందా.. లేదా పొత్తు పెట్టుకుంటుందా అన్నది తేలనుంది. ఢిల్లీ పెద్దల డైరక్షన్‌లోనే బీజేపీ రాష్ర్ట నేతలు జనసేన నాయకులతో భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి సాగాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. గురువారం జరగబోయే జనసేనతో భేటీ నేపథ్యంలో.. టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏపార్టీ అయినా సరే బీజేపీతోనే కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉందని.. ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీవైపే చూస్తున్నాయన్నారు. అంతేకాదు.. జనసేన పార్టీ.. బీజేపీలో విలీనం అయితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.