AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరిపై వేటు తప్పదు.. కోహ్లీ మార్క్ డెసిషన్!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పడంలోనే కాదు.. చెత్త రికార్డుల్లోనూ టాప్‌లో నిలిచాడు. మంగళవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా పది వికెట్ల తేడాతో ఒక వన్డేలో ఓటమిపాలవ్వడం భారత్‌కు ఇది ఐదోసారి కాగా… 2005లో దక్షిణాఫ్రికాతో […]

ఆ ఇద్దరిపై వేటు తప్పదు.. కోహ్లీ మార్క్ డెసిషన్!
Ravi Kiran
|

Updated on: Jan 17, 2020 | 5:50 AM

Share

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పడంలోనే కాదు.. చెత్త రికార్డుల్లోనూ టాప్‌లో నిలిచాడు. మంగళవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇలా పది వికెట్ల తేడాతో ఒక వన్డేలో ఓటమిపాలవ్వడం భారత్‌కు ఇది ఐదోసారి కాగా… 2005లో దక్షిణాఫ్రికాతో పరాజయం తర్వాత ఇంతటి భారీ ఓటమి చవి చూడటం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా రెండో వన్డేలో భారత్ తన లోపాలను సరిదిద్దే పనిలో పడింది. బ్యాటింగ్ ఆర్డర్ వైఫ్యలం వల్లే మ్యాచ్ చేజారడంతో విరాట్ కోహ్లీ జట్టులో పలు మార్పులు చేసేందుకు సన్నద్ధమయ్యాడు.

ఇప్పటికే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కంకషన్ కారణంగా రెండో వన్డేకు దూరం కావడంతో.. కెఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే మొదటి వన్డేలో ఈజీ స్టంపింగ్‌ను అతడు మిస్ చేయడంతో.. స్టేడియం మొత్తం ‘ధోని.. ధోని..’ అంటూ మారుమ్రోగింది. అందువల్ల సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా రాహుల్‌కి కూడా ఉద్వాసన పలికే యోచనలో ఉన్నట్లు సమాచారం. రోహిత్, ధావన్‌లు ఓపెనింగ్ జోడి కాగా, విరాట్ కోహ్లీ వన్ డౌన్‌లోనే దిగనున్నాడు. శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌లు ఆ తర్వాత బ్యాటింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది. మొదటి వన్డేలో ధారాళంగా పరుగులు ఇచ్చినా కూడా బుమ్రాపై విరాట్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. రెండో వన్డేలో గెలుపే ధ్యేయంగా టీమిండియా బరిలోకి దిగనుంది.

ఇకపోతే మొదటి వన్డేలో ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడింది. అన్ని విభాగాల్లోనూ చక్కటి ప్రదర్శన కనబరచడమే కాకుండా భారత్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో పూర్తిగా సఫలమైంది. ఇక టీమిండియా నిర్దేశించిన 256పరుగుల లక్ష్యాన్ని 38వ ఓవర్లోనే ఆసీస్ ఓపెనర్లు వార్నర్(128: 112 బంతుల్లో 17ఫోర్లు, 3సిక్సులు), ఆరోన్ ఫించ్(110; 114బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సులు)లు అలవోకగా ఛేదించారు. అటు రెండో వన్డేను కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతోంది. కాగా, ఇరు జట్ల మధ్య సెకండ్ మ్యాచ్ ఈ నెల 17వ తేదీన రాజ్‌కోట్‌లో జరగనుంది.

Follow Us