AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ఇప్పటి జనరేషన్‌లో సమంత ఉత్తమ నటి”

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో సమంత ఉత్తమ నటి అని హీరో శర్వానంద్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరి కాంబోలో ‘జాను’ అనే మూవీ త్వరలో విడుదల కాబోతుంది. తమిళంలో సూపర్‌ హిట్టయిన ’96’కు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే  రిలీజైన ఈ మూవీ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా సినిమా గురించి ఇటీవలే నేషనల్ మీడియాతో మాట్లాడాడు హీరో శర్వానంద్. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. 1996 స్కూల్ బ్యాచ్‌కు చెందిన ఇద్దరి […]

ఇప్పటి జనరేషన్‌లో సమంత ఉత్తమ నటి
Ram Naramaneni
|

Updated on: Jan 15, 2020 | 10:55 PM

Share

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో సమంత ఉత్తమ నటి అని హీరో శర్వానంద్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరి కాంబోలో ‘జాను’ అనే మూవీ త్వరలో విడుదల కాబోతుంది. తమిళంలో సూపర్‌ హిట్టయిన ’96’కు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే  రిలీజైన ఈ మూవీ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా సినిమా గురించి ఇటీవలే నేషనల్ మీడియాతో మాట్లాడాడు హీరో శర్వానంద్. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

1996 స్కూల్ బ్యాచ్‌కు చెందిన ఇద్దరి క్లాస్ మేట్స్ స్టోరీనే ఈ మూవీ అన్న శర్వా, మూవీ అంతా హృద్యమైన ప్రేమకథగా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.  స్కూల్లో విడిపోయిన వారు.. ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ కలిసినప్పడు వారిద్దరి మధ్య ఎదురయ్యే అనుభవాలు మనసును హత్తుకుంటాయని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నటించిన సమంత ఉత్తమ నటి, ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఆమె బెస్ట్ అని పేర్కొన్నారు శర్వానంద్. కాగా ‘జాను’ మూవీకి ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Follow Us