Woman Given Both Vaccines: టీకా కోసం వచ్చిన మహిళకు ఒకేసారి రెండు వ్యాక్సిన్లు.. ఐదు నిమిషాల వ్యవధిలో కోవిషీల్డ్, కోవాగ్జిన్.. ఇప్పుడెలా ఉందంటే?

అధికారుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. వ్యాక్సినేషన్ కోసం వచ్చిన వ్యక్తికి రెండు టీకాలు ఒకేసారి వేశారు. అదీకూడ రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Woman Given Both Vaccines: టీకా కోసం వచ్చిన మహిళకు ఒకేసారి రెండు వ్యాక్సిన్లు.. ఐదు నిమిషాల వ్యవధిలో కోవిషీల్డ్, కోవాగ్జిన్.. ఇప్పుడెలా ఉందంటే?
Woman Given Shots Of Both Covishield And Covaxin Within Five Minutes
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 18, 2021 | 6:37 PM

Woman Given Both Vaccine Shots Within 5 minutes: అధికారుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. వ్యాక్సినేషన్ కోసం వచ్చిన వ్యక్తికి రెండు టీకాలు ఒకేసారి వేశారు. అదీకూడ రెండు వేర్వేరు వ్యాక్సిన్లు ఇచ్చారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసిన వైద్యాధికారుల హుటాహుటీన ఆ గ్రామానికి చేరుకుని సదరు మహిళను అబ్జర్వేషన్‌లో పెట్టి పరీక్షిస్తున్నారు.

కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఉత్తమ మార్గమని వైద్య నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. తాజాగా బీహార్‌లో ఓ 63 ఏళ్ల మహిళ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు వైద్య సిబ్బంది. విషయం తెలియడంతో ఆమెను వైద్యులు అబ్జర్వేషన్‌లో ఉంచారు.

పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్‌ బెల్దారిచల్ ప్రాంతంలోని అవధ్‌పూర్ గ్రామానికి చెందిన సునీలా దేవి వ్యాక్సిన్ వేయించుకునేందుకు వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చింది. అక్కడ రెండు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేసి ఒక దగ్గర కోవాగ్జిన్, మరో దగ్గర కోవిషిల్డ్ టీకాలు వేస్తున్నారు. సునీలా దేవి మొదట ఒక లైన్‌లో నిల్చుని కోవాగ్జిన్ టీకా తీసుకుంది. అనంతరం మరో టీకా కూడా తీసుకోవాలేమో అనుకుని రెండో లైన్‌లో కూడా నిల్చుంది. అయితే, ఇది తెలియని నర్సులు ఎలాంటి ప్రశ్నలూ వేయకుండానే ఆమెకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా వేసేశారు. అనంతరం విషయం తెలుసుకున్న గ్రామస్థులు వ్యాక్సినేషన్ సెంటర్ ముందు ధర్నాకు దిగారు.

విషయం తెలియడంతో జిల్లా ఆరోగ్య అధికారి.. సిబ్బందితో కలిసి ఆ మహిళ ఇంటికి వెళ్లారు. ఆమె వ్యాక్సిన్ తీసుకున్న తీరుపై విచారణ చేపట్టారు. ఇక వెంటనే ఆ మహిళను ప్రభుత్వాసుపత్రికి తరలించి అబ్జర్వేషన్‌లో ఉంటారు. ఎప్పుటికప్పుడు ఆమెను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. కాగా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులకు హెల్త్ ఆఫీసర్‌కు జిల్లా వైద్యాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Read Also….  కాసేపట్లో పెళ్లి.. పోలీసుల రాకతో సీన్ రివర్స్.. చివరకు వరుడి తమ్ముడినే పెళ్లాడిన వధువు.. ఎక్కడంటే..