దేశంలో కరోనా టెర్రర్.. ఒక్క రోజే 15,968 కేసులు, 465 మరణాలు..
తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 15,968 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 465 కరోనా మరణాలు సంభవించాయి.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతుండటం ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 15,968 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 465 కరోనా మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,561,83కి చేరుకుంది. ఇందులో 1,83,022 యాక్టివ్ కేసులు ఉండగా.. 14,476 మంది కరోనాతో మరణించారు. అటు 2,58,684 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 10,495 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 1,39,010 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,531 మంది కరోనాతో చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 66,602 కేసులు, 2,301 మరణాలు సంభవించాయి. ఇక తమిళనాడులో అయితే.. 64,603 కేసులు నమోదు కాగా, 833 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కాగా, కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో సంభవించాయి.
#IndiaFightsCorona:#COVID19 India UPDATE:
▪️ Total Cases – 456183 ▪️Active Cases – 183022 ▪️Cured/Discharged- 258684 ▪️Deaths – 14476 ▪️Migrated – 1
as on June 24, 2020 till 8:00 AM pic.twitter.com/VDUHtBM2EP
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 24, 2020