తూతుకుడి ఘటనతో అట్టుడుకుతున్న తమిళనాడు
Tension Prevails in Tamil Nadu : తూతుకుడి లాకప్ డెత్ ఘటనపై తమిళనాడు అట్టుడికిపోతోంది. రాష్ట్ర వ్యాప్త బంద్ కొనసాగుతోంది. వీరికి వ్యాపార సంస్థలు మద్దతు పలికాయి. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. శాతంకులం పోలీసులు విచారణ లో మృతి చెందిన తండ్రి జయరాజ్, కొడుకు ఫీనిక్స్ మరణాలపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. రోజు రోజుకు ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. వీరి ఆందోళనలకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ లాకప్ డెత్ కారణమైన […]
Tension Prevails in Tamil Nadu : తూతుకుడి లాకప్ డెత్ ఘటనపై తమిళనాడు అట్టుడికిపోతోంది. రాష్ట్ర వ్యాప్త బంద్ కొనసాగుతోంది. వీరికి వ్యాపార సంస్థలు మద్దతు పలికాయి. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. శాతంకులం పోలీసులు విచారణ లో మృతి చెందిన తండ్రి జయరాజ్, కొడుకు ఫీనిక్స్ మరణాలపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. రోజు రోజుకు ఆందోళనలు ఉదృతమవుతున్నాయి. వీరి ఆందోళనలకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ లాకప్ డెత్ కారణమైన పోలీసు అధికారులను వెంటనే శిక్షించాలని కోరుతున్నారు.
అయితే ఈ ఘటనను మదురై హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ చేపట్టి పంచనామా నిర్వహణకు ముగ్గురు వైద్యులను ఏర్పాటు చేసింది. ఇందుకు కారణమైన సబ్ ఇన్స్పెక్టర్లు రఘు గణేష్ ,బాలకృష్ణన్ సస్పెండ్ చేసింది. స్టేషన్ సిబ్బందిని విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదిలా వుంటే కరోనా వ్యాప్తి వేగంగా ఉండటానికి తోడు ఇలా ప్రజలు నిరసనకు దిగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.