రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైలు ప్రయాణం రద్దైన ప్రయాణికులకు ఊరట కలిగించింది ఇండియన్ రైల్వే. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసులను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైలు ప్రయాణం రద్దైన ప్రయాణికులకు ఊరట కలిగించింది ఇండియన్ రైల్వే. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసులను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇందులో భాగంగా ఏప్రిల్ 14 ఆ తర్వాత రైళ్లలో ప్రయాణించేందుకు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు అందరికీ డబ్బు పూర్తి వాపసు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.
చాలా మంది రైల్వే ప్రయాణీకులు దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు ప్రయాణానికి 120 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా లాక్ డౌన్‌కు ముందు పెద్ద సంఖ్యలో IRCTC ద్వారా టికెట్లు బుక్ చేయబడ్డాయి. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఇండియన్ రైల్వే ఏప్రిల్ 15 నుంచి అన్ని సాధారణ రైళ్లలో బుకింగ్‌లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ సమయంలో రద్దైన రైళ్ల టికెట్లకుగాను ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తామని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఇదిలావుంటే.. ప్రస్తుతం అత్యవసర ప్రయాణాల నిమిత్తం రైల్వే వివిధ మార్గాల్లో 230 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.