Bigg Boss4 : అరియనా పై హాట్ కామెంట్స్ చేసిన అవినాష్.. పెళ్లిపై క్లారిటీ

బిగ్ బాస్4 చివరి అంకానికి వచ్చేసింది. మరో కొద్దివారంలో బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కాబోతుంది. ఈ క్రమంలో 10 వారాలు హౌస్ లో ఉన్న అవినాష్ బయటకు వచ్చేసాడు.

Bigg Boss4 : అరియనా పై హాట్ కామెంట్స్ చేసిన అవినాష్.. పెళ్లిపై క్లారిటీ
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 07, 2020 | 12:13 PM

బిగ్ బాస్4 చివరి అంకానికి వచ్చేసింది. మరో కొద్దివారంలో బిగ్ బాస్ సీజన్ 4 పూర్తి కాబోతుంది. ఈ క్రమంలో 10 వారాలు హౌస్ లో ఉన్న అవినాష్ బయటకు వచ్చేసాడు. గత కొన్ని వారాలుగా ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్న అవినాష్ ఈ సారి బయటకు రాక తప్పలేదు. బయటకు వచ్చిన అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అరియనా పై హాట్ కామెంట్స్ చేసాడు. బిగ్ బాస్ హౌస్ లో తనదైన కామెడీ పండించిన అవినాష్ ఇంటిసభ్యులందరితో బాగా కలిసిపోయాడు. అరియనా తో అవినాష్ ఎక్కువ క్లోజ్ గా ఉన్నాడు. ఆమెతో చట్టపట్టాలేసుకు తిరుగుతూ హాట్ టాపిక్ గా మారాడు. దాంతో ఇద్దరిమధ్య సంథింగ్ సంథింగ్ అని ప్రేక్షకులంతా అనుకున్నారు. ఇక అవినాష్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే సమయంలో అరియనా ఏడ్చేసింది. ‘నా కోసం వెయిట్ చెయ్. రెండు వారాల్లో వచ్చేస్తాను’ అంటూ కన్నీటి పర్యంతమైంది అరియనా. బయట నీకోసం ఎదురుచూస్తుంటా.. ఏడవొద్దు అంటూ అరియనా ను ఊరడించాడు అవినాష్. కాగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అరియనా ఫోటో చూపించగానే అవినాష్ ముద్దులు పెట్టాడు. దాంతో నీకు ఇంకా పెళ్ళిసంబందాలు రావు  అంటూ యాంకర్ అనడంతో.. నేను ఏంచేసినా ఫన్  కోసమే చేశాను..అలాగే ఆరియానాతోనూ అలాగే ప్రవర్తించా. ఆమె నా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే’ అంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు.