బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: ఇన్‌సైడ్ రీసౌండ్

ఇంతకాలం వైసీపీ వాడిన ఆయుధాన్నే ఇప్పుడు టీడీపీ వాడుతోంది. అదే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌. అమరావతి విషయంలో వైసీపీ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే, విశాఖ-విజయనగరం విషయంలో టీడీపీ దీన్నే కౌంటర్‌గా సంధించింది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ నేతలు 40వేల ఎకరాలు కొనుగోలు చేశారన్నది టీడీపీ నేత లోకేష్‌ చేస్తున్న బాంబింగ్‌. అంతేకాదు, అటు అమరావతిలోనూ, ఇటు రెండు జిల్లాల్లోనూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు జడ్జితో విచారణకు రెడీ అంటూ ఆయన సవాల్‌ చేస్తున్నారు. మరోవైపు అమరావతి రైతులు […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్: ఇన్‌సైడ్ రీసౌండ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 24, 2019 | 10:54 PM

ఇంతకాలం వైసీపీ వాడిన ఆయుధాన్నే ఇప్పుడు టీడీపీ వాడుతోంది. అదే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌. అమరావతి విషయంలో వైసీపీ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే, విశాఖ-విజయనగరం విషయంలో టీడీపీ దీన్నే కౌంటర్‌గా సంధించింది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ నేతలు 40వేల ఎకరాలు కొనుగోలు చేశారన్నది టీడీపీ నేత లోకేష్‌ చేస్తున్న బాంబింగ్‌. అంతేకాదు, అటు అమరావతిలోనూ, ఇటు రెండు జిల్లాల్లోనూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై హైకోర్టు జడ్జితో విచారణకు రెడీ అంటూ ఆయన సవాల్‌ చేస్తున్నారు. మరోవైపు అమరావతి రైతులు రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరుతున్నారు. అసలు ఈ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో నిజముందా? ఎంక్వైరీలు వేయకపోతే ఇది రాజకీయ అస్త్రంగానే మిగిలిపోతుందా అన్న అంశంపై ఇవాళ్టి బిగ్‌డిబేట్‌.

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ వైసీపీ నేతల ఆరోపణలకు అదే ఫార్ములాతో బలమైన కౌంటర్లను టీడీపీ మొదలుపెట్టింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ మీద హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలంటూ రాజధాని రైతుల సమక్షంలో చంద్రబాబు సవాల్‌ విసిరారు. ఇదేసందర్భంలో.. రాజధాని రైతులకు మద్దతుగా మంగళగిరిలో జరిగిన కాగడాల ర్యాలీలో నారా లోకేష్‌ పాల్గొన్నారు. విశాఖ-విజయనగరం జిల్లాల్లో వైసీపీ నేతలు 40వేల ఎకరాల భూములను కొనుగోలు చేశారంటూ నారాలోకేష్‌ ట్విట్టర్‌లో విమర్శించారు. వీటిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అయితే, అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ జరపాలన్న చంద్రబాబు డిమాండ్‌ను మంత్రి బొత్స తోసిపుచ్చారు.

అటు హైకోర్టును తరలించవద్దని అమరావతిలో న్యాయవాదులు ధర్నా చేశారు. ఇటు గుంటూరులో రాజధానిపై అఖిలపక్ష సమావేశం జరిగింది. రాజధాని తరలిపోతున్నప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి, ఉపఎన్నికలకు వెళితే, తాము పోటీ పెట్టబోమని టీడీపీ ఆఫర్‌ ఇచ్చింది.