ప్రయివేట్ హాస్పిటల్స్ మధ్య ఆధిపత్యపోరు, పేషంట్ చనిపోయినా ‘ఠాగూర్’ సినిమా మాదిరి ట్రీట్మెంట్ అంటూ వీడియోలు సర్క్యులేట్

ఆధ్యాత్మిక కేంద్రం చిత్తూరుజిల్లా తిరుపతిలో ప్రయివేట్ ఆసుపత్రుల మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది. తమకు చెందిన నారాయణాద్రి..

ప్రయివేట్ హాస్పిటల్స్  మధ్య ఆధిపత్యపోరు, పేషంట్ చనిపోయినా 'ఠాగూర్' సినిమా మాదిరి ట్రీట్మెంట్ అంటూ వీడియోలు సర్క్యులేట్
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 19, 2020 | 12:34 PM

ఆధ్యాత్మిక కేంద్రం చిత్తూరుజిల్లా తిరుపతిలో ప్రయివేట్ ఆసుపత్రుల మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరింది. తమకు చెందిన నారాయణాద్రి ఆసుపత్రిపై ఫేక్ వీడియో తయారు చేయించి మరో ప్రయివేట్ ఆసుపత్రి యాజమాన్యం సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. నారాయణాద్రిలో చనిపోయిన పేషంట్ దగ్గర ఠాగూర్ సినిమా మాదిరిగా నాటకమాడి డబ్బులు దోచుకున్నారంటూ సదరు వీడియో సారాంశంగా ఉందని చెబుతున్నారు. ఈ వీడియోలను ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి మాధ్యమాలలో సదరు ప్రయివేట్ ఆస్పత్రి యాజమాన్యం సర్క్యులేట్ చేయిస్తుందని నారాయణాద్రి హాస్పిటల్ యాజమాన్యం ఆరోపిస్తూ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. నారాయణాద్రి ఆసుపత్రి యాజమాన్యం ఫిర్యాదుతో 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారిపై 426, 469, 500 ఐపీసీ, 66 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. కుట్ర చేసిన ఆసుపత్రి పై విచారణ కొనసాగుతుండగా, ఆ ఆసుపత్రి పేరు మాత్రం బయటపెట్టేందుకు పోలీసులు నిరాకరించారు.