అమెరికా అధ్యక్షులవారి శునకం’ మేజర్’ వైట్‌హౌస్ వద్ద ఎవరినో కరిచిందట.. అలర్ట్ ప్లీజ్ !
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆప్యాయంగా, ప్రేమగా పెంచుకుంటున్న శునకం 'మేజర్' కాస్త అలజడినే సృష్టించింది. వైట్ హౌస్ వద్ద ఇది ఎవరినో కరిచి స్వల్పంగా గాయపరిచిందని ఈ హౌస్ మహిళా అధికార ప్రతినిధి జెన్ సాకి తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆప్యాయంగా, ప్రేమగా పెంచుకుంటున్న శునకం ‘మేజర్’ కాస్త అలజడినే సృష్టించింది. వైట్ హౌస్ వద్ద ఇది ఎవరినో కరిచి స్వల్పంగా గాయపరిచిందని ఈ హౌస్ మహిళా అధికార ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. మూడేళ్ళ వయసున్న ఈ జర్మన్ షెఫర్డ్ గుర్తు తెలియని వ్యక్తిని కరిచినట్టు ఆమె చెప్పారు. కుక్క కరిచిన విషయం తెలియగానే వైట్ హౌస్ సిబ్బంది మెడికల్ యూనిట్ ఆ వ్యక్తిని పరీక్షించి చికిత్స అవసరం లేదని తేల్చారట. బైడెన్ దంపతులు పెంచుకుంటున్న రెండు శునకాలు కొత్త వాతావరణం,కొత్త పరిస్థితులకు ఇంకా అలవాటు పడాల్సి ఉంటుందంటున్నారు. కాగా ఈ మేజర్ జాగిలం సెక్యూటిటీ స్టాఫ్ మెంబర్ ఒకరిని కరిచినట్టు సీఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది. అది ఆ వ్యక్తి చేతిని గాయపరిచేంత పని చేసిందని, కానీ అదేమంత పెద్ద గాయం కాదని ఈ సంస్థ వెల్లడించింది. తమ రెండు శునకాలను వాషింగ్టన్ లోని తమ 18 ఎకరాల కొత్త హోం కి అలవాటు చేయడానికి ఫస్ట్ లేడీ జిల్ యత్నిస్తున్నారు.
2018 లో బైడెన్ దంపతులు మేజర్ ని, మరో కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఇవి అంటే వారికి వల్లమాలిన అభిమానం.. తాము ఎక్కడికి వెళ్లినా వీటిని కూడా వాళ్ళు తీసుకుకెళ్తుంటారు. తమకుటుంబ సభ్యుల మాదిరే వీటిని చూసుకుంటారు. ఆ మధ్య మేజర్ సాక్షాత్తూ జోబైడెన్ నే కాలిపై స్వల్పంగా కరవడంతో ఆయన నడకలో కాస్త తడబడాల్సి వచ్చింది. ఇక 2008 లో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ రెండో సారి అధ్యక్షుడైనప్పుడు ఆయనగారి పెంపుడు కుక్క రాయిటర్స్ వార్త సంస్థ రిపోర్టర్ వేలిని కొరికి గాయపరిచింది. అందువల్ల పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నవారు, వారికీ సమీపంలో ఉన్నవారు కూడా కాస్త జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చదవండి:
Municipal Elections 2021: ఏపీలో కొనసాగుతున్న ఓటింగ్.. ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్