కన్న తండ్రే కాలయముడైన వేళ.. భద్రాద్రి జిల్లాలో ఘోరం…!

కొత్త గూడెం జిల్లా భద్రాద్రిలో దారుణం జరిగింది. పెంచి పోషించాల్సిన కన్నతండ్రే ఆ పాప పాలిట మృత్యువుగా మారాడు. పుట్టి నెల రోజులే అయ్యింది.. సరిగ్గా ఏమి తెలియదు అంతలోనే చావు ముంచుకొచ్చింది. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని.. ఆ ఆడశిశువును నీళ్ల తొట్టిలో ముంచి చంపేశాడు. చర్ల మండలం రేగుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు సూర్యతేజ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మొదటి సంతానం ఆడపిల్ల పుట్టడంతో.. రెండోసారి అయినా మగబిడ్డ పుడతాడని అనుకున్నాడు. కాని […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:14 pm, Tue, 1 October 19
కన్న తండ్రే కాలయముడైన వేళ.. భద్రాద్రి జిల్లాలో ఘోరం...!

కొత్త గూడెం జిల్లా భద్రాద్రిలో దారుణం జరిగింది. పెంచి పోషించాల్సిన కన్నతండ్రే ఆ పాప పాలిట మృత్యువుగా మారాడు. పుట్టి నెల రోజులే అయ్యింది.. సరిగ్గా ఏమి తెలియదు అంతలోనే చావు ముంచుకొచ్చింది. రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని.. ఆ ఆడశిశువును నీళ్ల తొట్టిలో ముంచి చంపేశాడు. చర్ల మండలం రేగుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు సూర్యతేజ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మొదటి సంతానం ఆడపిల్ల పుట్టడంతో.. రెండోసారి అయినా మగబిడ్డ పుడతాడని అనుకున్నాడు. కాని రెండోసారి కూడా పాపే పుట్టడంతో తట్టుకోలేక కోపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి ఇంటికొచ్చిన అతను శిశును తీసుకెళ్లి ఇంటిపక్కనే ఉన్న నీటి తొట్టిలో పడేశాడు.

తెల్లవారుజామున పాప కనిపించకపోవడంతో సూర్యతేజను భార్య అఖిల నిలదీసింది. అతడు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో అనుమానం వచ్చి.. బంధువులను పిలిచింది. అందరూ కలిసి నాలుగు తగిలించి నిలదీయడంతో మౌనంగా ఉండిపోయాడు. ఆడపిల్ల పుట్టిందన్న అక్కస్సుతోనే సూర్యతేజనే పాపను చంపేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.