AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: చిల్లర ఇవ్వలేదని మంత్రిని బస్సులోంచి దించేసిన కండక్టర్..! ఇదిగో వీడియో

ప్రజా ప్రతినిధులు అంటే.. కేవలం ఏసీ కార్లలో తిరుగారనేది అపోహ మాత్రమే.. కొన్ని సార్లు వారు నేరుగా క్షేత్ర స్థాయిలో వచ్చి కూడా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఉంటారు. తాజాగా ఇలానే మారు వేశంలో తన శాఖ పనితీరును పరిశీలించేందుకు వచ్చిన ఓ మంత్రి ఊహించని పరిణామం ఎదురైంది. చిల్లరేదనే కారణంతో ఆర్టీసీ కండక్టర్ మంత్రినే ఏకంగా బస్సులోంచి దించేశారు. ఈ ఘటన కర్ణాకట రాష్ట్రంలో వెలుగు చూసింది.

Viral News: చిల్లర ఇవ్వలేదని మంత్రిని బస్సులోంచి దించేసిన కండక్టర్..! ఇదిగో వీడియో
Karnataka Transport Minister
Anand T
|

Updated on: Jul 12, 2026 | 6:18 PM

Share

క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు కొన్ని సార్లు ప్రజా ప్రతినిధులే మారు వేశంలో ప్రజల్లోకి వస్తుంటారు. తాజాగా ఇక్కడో మంత్రి కూడా అలానే చేశారు. బెంగళూరు ప్రజా రవాణా వ్యవస్థలో సామాన్య ప్రయాణికులు ఎదుర్కొనే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ స్వయంగా రంగంలోకి దిగారు. శనివారం సాయంత్రం ఆయన మారువేశంలో సాదారణ ప్రయాణికుడిలా ముఖానికి మాస్క్ వేసుకుని బెంగుళూరు మహానగర రవాణా సంస్థ బస్సు ఎక్కారు. అయితే మంత్రి దగ్గర టికెట్టుకు సరిపడా చిల్లర లేకపోవడంతో కండక్టర్ అతన్ని బస్సు దిగిపోవాలని సూచించారు.

అయితే హెబ్బాల నుండి నాగశెట్టిహళ్లికి వెళ్తున్న BMTC బస్సు ఎక్కిన మంత్రి, తనకు రెండు టిక్కెట్లు ఇవ్వాలని కండక్టర్‌కు అడిగి రూ. 100 నోటు ఇచ్చారు. అయితే తన దగ్గర చిల్లర లేదని.. టికెట్టుకు సరిపడగా డబ్బులు ఇవ్వాలని కండెక్టర్ తన క్యాష్ బ్యాగ్ చూపించాడు. లేదంటే బస్సు దిగిపోవాలని ప్రయాణికుడి రూపంలో ఉన్న మంత్రికి చెప్పారు. తాను మాట్లాడుతోంది రాష్ట్ర రవాణా మంత్రితో అని తెలియని కండక్టర్, నిబంధనల ప్రకారం కచ్చితమైన ఫేర్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. అయితే మంత్రి కూడా తన గుర్తింపును బయటపెట్టకుండా సైలెంట్‌గా బస్సు దిగిపోయారు.

ఇవి కూడా చదవండి

ఇదొక్కటే కాదు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మంత్రి సురేష్ దాదాపు రెండు గంటల పాటు జయమహల్, ఆర్‌టి నగర్, హెబ్బాల, మాన్యత టెక్ పార్క్, నాగవార, హెన్నూరు, గెద్దలహళ్లి వంటి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన ఓ ఆటోలో కూడా ప్రయాణించాడు. అయితే మీటర్‌లో రూ.30 చూపించినప్పటికీ.. మీటర్ రీకాలిబ్రేషన్ చేయాల్సి ఉందంటూ డ్రైవర్ మంత్రిని రూ. 36 డిమాండ్ చేశాడు. అయితే అతనితో ఎలాంటి ఆర్గీవ్ చేయకుండా మంత్రి అతనికి రూ.40 ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

బెంగళూరు ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను ఉపయోగించే ప్రయాణికులు రోజూ ఎదుర్కొనే సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడమే లక్ష్యంగా మంత్రి ఈ సర్ప్రైజ్ విజిట్ చేశారు. అయితే ఈ తనిఖీల్లో భాగంగా బస్సుల్లో చిల్లర సమస్య, ఆటో రిక్షాల అదనపు వసూళ్ల వంటి ఇబ్బందులను ఆయన తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us