AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S Janaki: ఇక సెలవు.. ముగిసిన జానకమ్మ అంత్యక్రియలు.. మైసూరులోని తోటలో తుది వీడ్కోలు..

లెజెండరీ సింగర్ ఎస్ జానకి తుది శ్వాస విడిచారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచంలో 50వేలకు పైగా పాటలు పాడి కోట్లాది మందిని మైమరపించారు. శనివారం రాత్రి 88 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూసిన జానకమ్మ అంత్యక్రియలు ప్రభుత్వం లాంఛనాలతో ముగిశాయి.

S Janaki: ఇక సెలవు.. ముగిసిన జానకమ్మ అంత్యక్రియలు.. మైసూరులోని తోటలో తుది వీడ్కోలు..
S Janaki Last Rites
Rajitha Chanti
|

Updated on: Jul 12, 2026 | 6:16 PM

Share

దక్షిణాది గానకోకిల ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి. మైసూరు సమీపంలోని కణియర హుండి గ్రామంలో ఉన్న ఆమె సొంత ఫామ్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. బ్రాహ్మణ సంప్రదాయంలో జానకమ్మ అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు, సినీతారలు పాల్గొని తమ అభిమాన గాయని జానకమ్మకు తుది వీడ్కోలు పలికారు. అంతకు ముందు అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూరులోని మహారాజ కాలేజీ గ్రౌండ్స్ లో సాయంత్రం 4 గంటల వరకు ఉంచగా.. చివరి చూపు కోసం పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. అనంతరం జానకమ్మ అంతిమయాత్ర ప్రారంభించి.. కణియర హుండి గ్రామంలోని ఫామ్ హౌస్‌కి పార్థీవదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

గత కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న జానకమ్మ మైసూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శనివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.ఆమె వయసు 88 సంవత్సరాలు. గత ఆరు నెలల క్రితం జానకమ్మ కుమారుడు చనిపోవడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అదే సమయంలో వృద్ధాప్య సమస్యలు కూడా తోడుకావడంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.

మూడేళ్ల ప్రాయం నుంచే సంగీతంపై మక్కువతో పాటలు పాడడం ప్రారంభించారు జానకమ్మ. 1957లో తమిళ చిత్రం ‘విధియిన్ విలయాత్తు’ ద్వారా నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది ‘ఎమ్మెల్యే’ చిత్రంలో ‘నీతియే జయమౌనురా’ అనే పాట పాడారు. దాదాపు 5 తరాల హీరోయిన్లకు గాత్రం అందించారు జానకమ్మ. జూలై 12న సాయంత్రం అధికారిక లాంఛనాలతో ఎస్ జానకి అంత్యక్రియలు ముగిశాయి.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.

జానకమ్మ అంత్యక్రియలు..

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..

Follow Us