AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్య’ సినిమా అత‌డి జీవితాన్ని మార్చివేసింది..ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్

మొద‌టి చిత్రం ‘కార్తికేయ’తోనే విభిన్న‌త ఉండే సినిమాలు రూపొందించే ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కి ప‌రిచ‌యం అయ్యాడు చందూ మొండేటి. నిఖిల్ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా అప్ప‌ట్లో మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే దానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రాబోతుంది. ‘కార్తికేయ’ చిత్రం ఎంతగా అలరించిందో ‘కార్తికేయ 2’ కాన్సెప్ట్‌ వీడియో అదే రేంజ్ లో మూవీ ల‌వ‌ర్స్ ని ఆకర్షిస్తోంది. థ్రిల్లర్‌ సస్పెన్స్ జోన‌ర్‌ మాత్రమే కాదు..ల‌వ్ స్టోరీస్ కూడా త‌నదైన మేకింగ్ తో […]

'ఆర్య' సినిమా అత‌డి జీవితాన్ని మార్చివేసింది..ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్
Ram Naramaneni
|

Updated on: May 18, 2020 | 8:35 AM

Share

మొద‌టి చిత్రం ‘కార్తికేయ’తోనే విభిన్న‌త ఉండే సినిమాలు రూపొందించే ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కి ప‌రిచ‌యం అయ్యాడు చందూ మొండేటి. నిఖిల్ హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా అప్ప‌ట్లో మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే దానికి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ రాబోతుంది. ‘కార్తికేయ’ చిత్రం ఎంతగా అలరించిందో ‘కార్తికేయ 2’ కాన్సెప్ట్‌ వీడియో అదే రేంజ్ లో మూవీ ల‌వ‌ర్స్ ని ఆకర్షిస్తోంది.

థ్రిల్లర్‌ సస్పెన్స్ జోన‌ర్‌ మాత్రమే కాదు..ల‌వ్ స్టోరీస్ కూడా త‌నదైన మేకింగ్ తో తెర‌కెక్కించి ఫిదా చేశాడు చందూ. మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’ని రీమేక్‌లా కాకుండా..త‌న మార్క్ స్టైల్ తో తీసి హిట్ కొట్టాడు. మరి చందుకి అసలు డైరెక్ట‌ర్ అవ్వాలనే కోరిక ఎప్పుడు కలిగింది. అత‌డికి స్ఫూర్తి ఏంటో? తెలుసుకుందాం.

అది 2004 సంవ‌త్స‌రం. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన ‘ఆర్య’ రిలీజై యూత్ ని మెస్మ‌రైజ్ చేస్తోంది. ఆ నెక్ట్స్ డే చందు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ టిఫిన్‌ సెంటర్‌ దగ్గర ఉన్నాడు. అక్కడ ‘ఆర్య’ మూవీ గురించి క‌థ‌లు..క‌థ‌లుగా చెప్పుకుంటున్నారు జ‌నాలు. ఆ సినిమా ద‌ర్శ‌కుడు సుకుమార్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అక్క‌డ్నుంచి మరో చోటుకి వెళ్తే అక్కడా సేమ్ సీన్ రిపీట్. “ఓ సినిమా ప్రేక్షకులకి నచ్చితే దర్శకుడ్ని ఇంతగా ఆకాశానికి ఎత్తేస్తారా” అనే ఫీలింగ్ కలిగింది చందుకి. త‌న‌ గురించి ఇలా మాట్లాడుకోవాల‌నే క‌సి అత‌డిలో మొద‌లైంది. అప్పటికే ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన చందు ‘ఆర్య’ స్ఫూర్తితో సినిమాల వైపు అడుగులు వేసి..ఇప్పుడు దిగ్విజ‌యంగా ముందుకు వెళ్తున్నాడు.

Horoscope Today: వారికి జీతభత్యాలు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి జీతభత్యాలు పెరిగే అవకాశం..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!