AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింహంలా కాదు.. బొద్దింకలా ఉండండి..చేతన్ భగత్ చెప్పిన సక్సెస్ ఫార్ములా!

మనం సాధారణంగా సమాజంలో బలవంతులను సింహంతో పోల్చుతుంటాము. వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా అందరూ సింహంలా గర్జించాలని, తిరుగులేని శక్తిగా ఎదగాలని కోరుకుంటారు. కానీ, ప్రముఖ రచయిత, మోటివేషనల్ స్పీకర్ చేతన్ భగత్ దీనికి భిన్నమైన, ఆలోచింపజేసే ఒక విచిత్రమైన సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. నేటి ఆధునిక కాలంలో మనుగడ సాగించాలన్నా, కెరీర్‌లో రాణించాలన్నా సింహం కంటే బొద్దింక లా మారడం చాలా ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. వినడానికి ఇది కాస్త వింతగా అనిపించినా, దీని వెనుక ఉన్న అంతరార్థం మాత్రం అక్షరసత్యం.

సింహంలా కాదు.. బొద్దింకలా ఉండండి..చేతన్ భగత్ చెప్పిన సక్సెస్ ఫార్ములా!
Chetan Bhagat Success Tips
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2026 | 1:05 PM

Share

ప్రముఖ రచయిత చేతన్ భగత్ నేటి మారుతున్న ప్రపంచంలో కెరీర్, సంబంధాలు, జీవితంలో విజయం సాధించడానికి ఒక సరికొత్త సిద్ధాంతాన్ని పంచుకున్నారు. ఆయన ప్రకారం, ప్రస్తుత కాలంలో సింహంలా బలంగా ఉండటం కంటే బొద్దింకలా అడాప్టబిలిటీ అంటే పరిస్థితులకు అనుగుణంగా మారే గుణం కలిగి ఉండటం చాలా ముఖ్యం అని వివరించారు. మారుతున్న టెక్నాలజీ, కెరీర్ సవాళ్లు, బంధాలలో వచ్చే మార్పులను తట్టుకుని నిలబడాలంటే పట్టువిడుపులు, ఫ్లెక్సిబిలిటీ, సహనం అత్యంత అవసరమని ఆయన వెల్లడించారు..

చేతన్ భగత్ ప్రకారం.. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం.. అత్యంత బలమైన జీవి లేదా అత్యంత తెలివైన జీవి మాత్రమే భూమిపై మనుగడ సాగించలేదు. కాలంతో పాటు వచ్చే మార్పులకు అనుగుణంగా త్వరగా మారే జీవి మాత్రమే బ్రతుకగలదు. చేతన్ భగత్ ఈ సూత్రాన్ని బొద్దింకల ఉదాహరణతో వివరించారు. భూమిపై ఎన్నో శతాబ్దాల క్రితం నివసించిన భారీ డైనోసార్ల వంటి బలమైన జీవులు ప్రకృతిలో వచ్చిన మార్పులను తట్టుకోలేక అంతరించిపోయాయి. కానీ, బొద్దింకలు మాత్రం తమ ఆకారాన్ని, అలవాట్లను మారుస్తూ కోట్లాది సంవత్సరాలుగా నేటికీ జీవిస్తూనే ఉన్నాయి.

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా దూసుకుపోతోంది. నిన్న ఉన్న ఉద్యోగాలు ఈరోజు ఉండటం లేదు. ఇలాంటి సమయంలో.. నేను ఈ పని మాత్రమే చేస్తాను, నా పద్ధతి ఇంతే అని సింహంలా మొండిగా ఉంటే కెరీర్ పరంగా వెనుకబడిపోతారు. బొద్దింకలా ఏ వాతావరణానికైనా సర్దుకుపోయే గుణం అలవర్చుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడమే నిజమైన విజయం.

ఇవి కూడా చదవండి

ఈ అడాప్టబిలిటీ కేవలం కెరీర్‌కే కాదు, వ్యక్తిగత జీవితానికి కూడా వర్తిస్తుంది. బంధాలు ముక్కలవడానికి ప్రధాన కారణం అహం (Ego). భాగస్వామితో మాట్లాడేటప్పుడు పట్టువిడుపులు ప్రదర్శించడం, అవతలి వారి పరిస్థితులను అర్థం చేసుకుని మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవడం వల్ల బంధాలు కలకాలం నిలుస్తాయి. ఇక్కడ సింహంలాంటి అహంకారం కంటే, బొద్దింకలాంటి లొంగుబాటు తత్వమే కుటుంబాన్ని నిలబెడుతుంది.

చేతన్ భగత్ చెప్పిన ఈ సిద్ధాంతం ముఖ్య ఉద్దేశం.. సమాజంలో గౌరవాన్ని కోల్పోవాలని కాదు, పరిస్థితులకు తగ్గట్టుగా ఫ్లెక్సిబుల్‌గా ఉండటాన్ని నేర్చుకోవాలని. కాలంతో పాటు మారే మనస్తత్వం ఉన్నవారే జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా తట్టుకుని సుదీర్ఘకాలం నిలబడగలరు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సింహంలా కాదు.. బొద్దింకలా ఉండండి! జీవితంలో గెలవాలంటే.. చేతన్ భగత్
సింహంలా కాదు.. బొద్దింకలా ఉండండి! జీవితంలో గెలవాలంటే.. చేతన్ భగత్
ఎల్లిపాయ కారం.. ఇలా చేస్తే ఎగబడి తింటారు..
ఎల్లిపాయ కారం.. ఇలా చేస్తే ఎగబడి తింటారు..
Video: లవర్ కోసం ఎలుకను తెచ్చిన పిల్లి.. తీరా చూస్తే షాకింగ్ సీన్
Video: లవర్ కోసం ఎలుకను తెచ్చిన పిల్లి.. తీరా చూస్తే షాకింగ్ సీన్
నా తప్పు తెలుసుకున్నాను.. వీడియో రిలీజ్ చేసిన శ్రీజ కొణిదెల
నా తప్పు తెలుసుకున్నాను.. వీడియో రిలీజ్ చేసిన శ్రీజ కొణిదెల
ఏథర్ స్కూటర్లలో సరికొత్త మ్యాజిక్. మీ స్కూటర్ మీతో మాట్లాడుతుంది!
ఏథర్ స్కూటర్లలో సరికొత్త మ్యాజిక్. మీ స్కూటర్ మీతో మాట్లాడుతుంది!
ఆంధ్రా వాసులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త ఎయిర్‌పోర్ట్ వచ్చేస్తోందోచ
ఆంధ్రా వాసులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త ఎయిర్‌పోర్ట్ వచ్చేస్తోందోచ
పెరుగు అన్నం తాలింపు 5 నిమిషాల్లో రుచిగా ఇలా చేయండి
పెరుగు అన్నం తాలింపు 5 నిమిషాల్లో రుచిగా ఇలా చేయండి
కాల్చిన కొబ్బరితో పెరుగు పచ్చడి..
కాల్చిన కొబ్బరితో పెరుగు పచ్చడి..
లక్షలు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన మరుసటి రోజే బ్రేకప్‌! ప్రియుడి ఆవేదన
లక్షలు ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన మరుసటి రోజే బ్రేకప్‌! ప్రియుడి ఆవేదన
మిమ్మల్ని కోటీశ్వరులను చేసే 5 బిజినెస్‌ ఐడియాలు..నెలకు రూ.50 వేలు
మిమ్మల్ని కోటీశ్వరులను చేసే 5 బిజినెస్‌ ఐడియాలు..నెలకు రూ.50 వేలు