AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ather EV: ఏథర్ స్కూటర్లలో సరికొత్త మ్యాజిక్. ఇకపై మీ స్కూటర్ మీతో మాట్లాడుతుంది.. ఫోన్ చూడకుండానే రూట్ మ్యాప్!

Ather EV Smart Voice Features: ఈ కొత్త ఫీచర్ కేవలం నావిగేట్ చేయడానికి మాత్రమే పరిమితం కాదు. రైడర్లు వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేయవచ్చు. మ్యూజిక్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. అలాగే స్కూటర్ వివిధ సెట్టింగ్‌లను మార్చవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, మ్యాజిక్ ట్విస్ట్..

Ather EV: ఏథర్ స్కూటర్లలో సరికొత్త మ్యాజిక్. ఇకపై మీ స్కూటర్ మీతో మాట్లాడుతుంది.. ఫోన్ చూడకుండానే రూట్ మ్యాప్!
Ather Rizta 450x
Subhash Goud
|

Updated on: Jun 10, 2026 | 12:51 PM

Share

Ather EV Smart Voice Features: భారతదేశపు ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన ఏథర్ ఎనర్జీ తన స్కూటర్లను మరింత స్మార్ట్‌గా తయారు చేసింది. ఈ కంపెనీ ‘వాయిస్ ఆన్ ఏథర్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా రైడర్లు తమ చేతులను ఉపయోగించకుండా కేవలం మాట్లాడటం ద్వారా వివిధ పనులను చేయవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఈ స్కూటర్లు రైడర్లతో సంభాషించి, ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందిస్తాయి.

స్కూటర్‌ను వాయిస్ ద్వారా నియంత్రణ:

ఈ ఫీచర్ ఏథర్ జెన్ 3, కొత్త మోడళ్లలో అందుబాటులో ఉంది. ఏథర్ 450X, 450 అపెక్స్, రిజ్టా Z రైడర్లు ఇప్పుడు బ్లూటూత్ హెడ్‌సెట్ లేదా హాలో స్మార్ట్ హెల్మెట్ ద్వారా స్కూటర్‌కు వాయిస్ కమాండ్‌లు ఇవ్వగలరు. రైడర్లు కేవలం మాట్లాడటం ద్వారా నావిగేషన్‌ను ప్రారంభించడం. ఒక ప్రదేశం గురించిన సమాచారం కోసం వెతకడం, సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం వంటివి చేయగలరు.

ఇది కూడా చదవండి: ATM Shutdown: దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!

ఇవి కూడా చదవండి

ధర ఎంత?

  • అథర్ 450X – రూ.1,52,499 ప్రారంభ ధర
  • 450 అపెక్స్ – రూ.1,94,999 ప్రారంభ ధర
  • రిజ్టా జెడ్ – ప్రారంభ ధర రూ.1,36,999
  • అయితే ఈ మోడళ్లకు కొత్త ఫీచర్లు జోడించినప్పుడు వాటి ధరలు పెరగవచ్చు.

ఈ కొత్త ఫీచర్ కేవలం నావిగేట్ చేయడానికి మాత్రమే పరిమితం కాదు. రైడర్లు వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేయవచ్చు. మ్యూజిక్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. అలాగే స్కూటర్ వివిధ సెట్టింగ్‌లను మార్చవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, మ్యాజిక్ ట్విస్ట్ రీజెనరేషన్ లెవెల్స్ వంటి ఫీచర్లను కూడా వారి వాయిస్ ద్వారా నియంత్రించవచ్చు.

ఈ సిస్టమ్ LLM, సహజ భాషా ప్రాసెసింగ్ టెక్నాలజీపై ఆధారపడి ఉందని ఏథర్ చెబుతోంది. భవిష్యత్తులో దీనిని మరింత మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది. భవిష్యత్తులో ఈ స్కూటర్ రైడర్‌తో ఆటోమేటిక్‌గా సంభాషిస్తూ, మార్గాలు, బ్యాటరీ లైఫ్, భద్రత, ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించి సమాచారం, సూచనలు, హెచ్చరికలను అందిస్తుంది. ఇది రైడింగ్ అనుభవాన్ని మునుపెన్నడూ లేనంత స్మార్ట్‌గా, సురక్షితంగా చేస్తుంది.

ఇది కూడా చదవండి: Business Ideas: మిమ్మల్ని కోటీశ్వరులను చేసే 5 బిజినెస్‌ ఐడియాలు.. నెలకు రూ. 50,000 సంపాదించవచ్చు!

ఇది కూడా చదవండి: Gold Price Fall: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం.. వెండిపై రూ.10 వేలు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?