AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆంధ్రా వాసులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త ఎయిర్‌పోర్ట్ వచ్చేస్తోందోచ్.. నెరవేరనున్న దశాబ్దాల కల!

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రజా రవాణాతో పాటు స్థానిక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు రవాణా వ్యవస్థే కీలకం. ఈ నేపథ్యంలోనే, నెల్లూరు జిల్లా వాసుల దశాబ్దాల నాటి కల అయిన 'దగదర్తి విమానాశ్రయం' నిర్మాణానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో పది రోజుల్లోనే టెండర్ల ప్రక్రియను ముగించి, కాంట్రాక్టు సంస్థకు పనులను అప్పగించేందుకు సిద్ధమైంది.

ఆంధ్రా వాసులకు గుడ్‌న్యూస్.. మరో కొత్త ఎయిర్‌పోర్ట్ వచ్చేస్తోందోచ్.. నెరవేరనున్న దశాబ్దాల కల!
Dagadarthi Airport At Nellore Feature Image
Ch Murali
| Edited By: |

Updated on: Jun 10, 2026 | 12:48 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రజా రవాణాతో పాటు స్థానిక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు రవాణా వ్యవస్థే కీలకం. ఈ నేపథ్యంలోనే, నెల్లూరు జిల్లా వాసుల దశాబ్దాల నాటి కల అయిన ‘దగదర్తి విమానాశ్రయం’ నిర్మాణానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో పది రోజుల్లోనే టెండర్ల ప్రక్రియను ముగించి, కాంట్రాక్టు సంస్థకు పనులను అప్పగించేందుకు సిద్ధమైంది.

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని దగదర్తి వద్ద ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 1400 ఎకరాల భూమిని కేటాయించింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (PPP) విధానంలో రూ. 648 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల షెడ్యూల్ ఖరారు అయ్యింది. టెండర్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 12గా నిర్ణయించారు. టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లను జూన్ 17న ఓపెన్ చేయనున్నారు. పనుల కేటాయింపు ప్రక్రియ బిడ్డింగ్‌లో అర్హత సాధించిన సంస్థకు 15 రోజుల్లోగా నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారు.

దగదర్తి ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర హోంశాఖ, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల నుంచి ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయి. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పనులు ప్రారంభించి, 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి మొదటి దశను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలి దశలోనే రన్‌వే, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, కార్ పార్కింగ్, షాపింగ్ ఏరియా వంటి మౌలిక వసతులను సిద్ధం చేస్తారు.

ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే కేవలం నెల్లూరు జిల్లాకే కాకుండా, పొరుగున ఉన్న ప్రకాశం, కడప జిల్లాల ప్రయాణికులకు సైతం ఎంతో అనుకూలంగా మారనుంది. రోజుకు దాదాపు 2,200 మంది ప్రయాణికులు సేవలు పొందేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. నిత్యం 27 విమానాలు రాకపోకలు సాగించేలా అత్యాధునిక వసతులతో ఈ ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దనున్నారు. దగదర్తి విమానాశ్రయం సాకారమైతే దక్షిణ ఆంధ్రాలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి అవకాశాలు సరికొత్త పుంతలు తొక్కడం ఖాయం. నెల్లూరు ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us