నెల వ్యవధిలో రెండు కాన్పులు..ముగ్గురు బిడ్డలు

నెల వ్యవధిలో రెండు కాన్పులు..ముగ్గురు బిడ్డలు

ఢాకా: ఒకే కాన్పులో కవలలకు జన్మనివ్వడం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. డజను మంది పిల్లలకి కూడా ఒకే కాన్పులో జన్మనిచ్చిన ఘటనలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అయితే నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రసవించింది ఓ మహిళ. రెండో కాన్పులో ఏకంగా కవలకు జన్మనివ్వడం అరుదైన విషయం. మొదటి కాన్పులో మగబిడ్డ కాగా, రెండవ కాన్పులో ఒక మగ బిడ్డ, ఒక ఆడబిడ్డ. తల్లి, బిడ్డలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. […]

Ram Naramaneni

|

Mar 28, 2019 | 3:59 PM

ఢాకా: ఒకే కాన్పులో కవలలకు జన్మనివ్వడం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. డజను మంది పిల్లలకి కూడా ఒకే కాన్పులో జన్మనిచ్చిన ఘటనలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. అయితే నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రసవించింది ఓ మహిళ. రెండో కాన్పులో ఏకంగా కవలకు జన్మనివ్వడం అరుదైన విషయం. మొదటి కాన్పులో మగబిడ్డ కాగా, రెండవ కాన్పులో ఒక మగ బిడ్డ, ఒక ఆడబిడ్డ. తల్లి, బిడ్డలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఈ అరుదైన సంఘటన బంగ్లదేశ్‌లో చోటు చేసుకుంది.

బంగ్లాదేశ్‌లోని జెస్సోర్‌ ప్రాంతానికి చెందిన అరిఫా సుల్తానా ఐతీ ఫిబ్రవరి 25న నెలలు నిండని ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించగా.. సాధారణ ప్రసవం అయ్యింది. తల్లీబిడ్డా ఇద్దరు క్షేమంగా ఉండటంతో వైద్యులు వారిని ఇంటికి పంపించారు. అయితే ఇటీవల మార్చి 22న అరిఫాకు మరోసారి నొప్పులు వచ్చాయి. దీంతో కంగారుపడిన  కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు స్కాన్ చేసి ఆమె గర్భంలో మరో ఇద్దరు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్  చేశారు. అంటే సరిగ్గా 26 రోజుల తర్వాత అరిఫా మరో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు.

కాగా మహిళకు రెండు గర్భాశయాలు ఉండటం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు చెప్తున్నారు. జెస్సోర్‌ చీఫ్‌ గవర్నమెంట్‌ డాక్టర్‌ దిలీప్‌ రాయ్‌ స్పందిస్తూ… 30 ఏళ్ల తమ మెడికల్ సర్వీస్‌లో ఇటువంటి కేసు చూడలేదని అన్నారు.  కాగా ముగ్గురు పిల్లలు కలగడం సంతోషంగా ఉన్నా వారినెలా పెంచాలో అర్థం కావడం లేదంటూ సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త రోజూవారీ కూలీ అని.. నెలకు చాలా తక్కువ సంపాదిస్తాడని పేర్కొంది. అయితే ఆమె భర్త మాట్లాడుతూ.. ‘అల్లా దయ వల్ల నా పిల్లలు క్షేమంగా ఉన్నారు. వారిని సంతోషంగా ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని తండ్రి ప్రేమను చాటుకున్నాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu