ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సబ్‌స్క్రైబర్లు వారి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దాదాపు 75 శాతం వరకు ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఈపీఎఫ్‌వో గతేడాది అనుమతినిచ్చింది. అయితే ఉద్యోగం కోల్పోయి నెల రోజులు దాటి ఉంటేనే ఈ వెసులుబాటు ఉంటుంది. అదే రెండు నెలల పాటు ఉపాధి లేకపోతే మిగతా 25 శాతం మొత్తాన్ని కూడా వెనక్కు తీసుకోవచ్చు.
కొన్ని సందర్భాల్లో ఉద్యోగం చేస్తున్నా కూడా ఈపీఎఫ్ మొత్తాన్ని వెనక్కు తీసుకోగలం. అనారోగ్యం, పెళ్లి ఖర్చులు, పిల్లల చదువు, ఇంటి కొనుగోలు, కొత్త ఇంటి నిర్మాణం, రుణ చెల్లింపులు వంటి సందర్భాల్లో మాత్రమే ఈపీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోగలం.
ఆన్‌లైన్‌లో పీఎఫ్ డబ్బుల్ని ఎలా విత్‌డ్రా చేసుకోవాలో చూద్దాం..