‘సూపర్ జూపిటర్‌’పై పరిశోధనలలో ముందడుగు

‘సూపర్ జూపిటర్‌’పై పరిశోధనలలో ముందడుగు

సౌర కుటుంబం ఆవల ఉన్న గ్రహాలపై(సూపర్‌ జూపిటర్స్) పరిశోధనలు చేసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ‘ఆప్టిమల్ ఇంటర్‌ఫెరోమెట్రీ’ అనే కొత్త పద్ధతిని ఉపయోగించి వారు ఆ గ్రహాలను అధ్యయనం చేయనున్నారు. దీని వలన అక్కడి వాతావరణం, మానవుడి మనుగడకు అనుకూలించే అంశాలు, గ్రహాంతర జీవులు వంటి తదితర అంశాలపై వారు పరిశోధనలు చేయనున్నారు. కాగా 2010లోఫ్రాన్స్‌కు చెందిన కొంతమంది పరిశోధకులు భూమికి 129 కాంతి సంవత్సరాల దూరంలో ఒక గ్రహాన్ని కనుగొన్నారు. దానికి HR8799e అని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 28, 2019 | 3:27 PM

సౌర కుటుంబం ఆవల ఉన్న గ్రహాలపై(సూపర్‌ జూపిటర్స్) పరిశోధనలు చేసేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ‘ఆప్టిమల్ ఇంటర్‌ఫెరోమెట్రీ’ అనే కొత్త పద్ధతిని ఉపయోగించి వారు ఆ గ్రహాలను అధ్యయనం చేయనున్నారు. దీని వలన అక్కడి వాతావరణం, మానవుడి మనుగడకు అనుకూలించే అంశాలు, గ్రహాంతర జీవులు వంటి తదితర అంశాలపై వారు పరిశోధనలు చేయనున్నారు.

కాగా 2010లోఫ్రాన్స్‌కు చెందిన కొంతమంది పరిశోధకులు భూమికి 129 కాంతి సంవత్సరాల దూరంలో ఒక గ్రహాన్ని కనుగొన్నారు. దానికి HR8799e అని నామకరణం చేసిన పరిశోధకులు.. ఆ గ్రహంపై ఐరన్, సిలికేట్ ఉన్నట్లు గుర్తించారు. అయితే అక్కడ ఉన్న స్థితులపై పూర్తిగా అధ్యయనం చేసేందుకు వారికి వీలు కుదరలేదు. ఎందుకంటే ఆ గ్రహం చుట్టూ ఉన్న నక్షత్రాలు సరైన కాంతిని ప్రసరింపజేయకపోవడంతో HR8799eపై పరిశోధనలు చేసేందుకు వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి.

దీంతో వారు కొత్త పద్ధతిని కనుగొన్నారు. ఆప్టిమల్ ఇంటర్‌ఫెరోమెట్రీ ద్వారా నాలుగు శక్తివంతమైన టెలీస్కోప్‌లను వాడనున్న పరిశోధకులు అవన్నీ ఒకే విధంగా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ నాలుగు టెలీస్కోప్‌ల నుంచి సూపర్ జూపిటర్‌పైకి కాంతి కిరణాలను పంపనున్న పరిశోధకులు దాని ద్వారా ఆ గ్రహంపై పరిశోధనలు కొనసాగించనున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu