AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివేకానందరెడ్డి హత్య కేసులో పీఏతో సహా ముగ్గురి అరెస్ట్

ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి, వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో పోలీసులు మరో ముగ్గురు నిందుతుల్ని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మీ కుమారుడు ప్రకాష్‌లు ఉన్నారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఈ ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురి అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ఈ […]

వివేకానందరెడ్డి హత్య కేసులో పీఏతో సహా ముగ్గురి అరెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2019 | 4:28 PM

Share

ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి, వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో పోలీసులు మరో ముగ్గురు నిందుతుల్ని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మీ కుమారుడు ప్రకాష్‌లు ఉన్నారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఈ ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురి అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ఈ నెల 15న ఉదయం 8 గంటల సమయంలో వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వివేకానందరెడ్డి చనిపోయారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పులివెందులలో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. తర్వాత శవపంచనామా సమయంలో సాక్ష్యాలు, రక్తపు మరకలు, బంధువుల చెప్పిన దానిని బట్టి హత్యకేసుగా మార్చాము’అన్నారు.

వివేకా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను వీరు తారుమారు చేశారని పోలీసులు గుర్తించారు. బాత్‌రూమ్‌లో ఉన్న వివేకా మృతదేహాన్ని వీరు బెడ్‌రూమ్‌కి తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు…బెడ్‌రూమ్‌లో ఉన్న రక్తపు ఆనవాళ్లను చెరిపేసి సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డికి వివేకా రాసిన లేఖ దొరికినా, సాయంత్రం వరకు దాన్ని పోలీసులకు ఇవ్వలేదనే కారణంతో పోలీసులు పీఏను కూడా అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టుకు తరలించారు.

'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
'ది రాజాసాబ్' ఈవెంట్‌లో డైరెక్టర్‌ మారుతి కూతురును చూశారా? వీడియో
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
శీతాకాలంలో బెల్లం తినడం సురక్షితమేనా.. అసలు విషయం తెలిస్తే..
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు అస్సలు చేయొద్దు!
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
దోస్త్ మేరా దోస్త్.. కొండముచ్చు, రెండు కుక్కలు ఏం చేశాయో తెలుసా..
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
గ్రామంలో 30 ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జననం! కోట్లు ప్రకటించిన ప్రధాని
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
కింగ్ మళ్ళీ టెస్టుల్లోకి వస్తాడా? సిద్ధూ ఆశ.. అభిమానుల శ్వాస
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన టాప్-5 దేశాలు ఇవే..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
ఒకప్పుడు రంజీ క్రికెటర్.. చిరంజీవిని చూసి హీరో అయిపోయాడు..
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య..
కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య..