AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిల్వ ఉంటాయని.. వీటిని ఫ్రిడ్జి లో పెడుతున్నారా… అవి విషం కంటే ప్రమాదమట..అవేంటో తెలుసుకోండి..!

పూర్వకాలంలో ఉదయం టిఫిన్ గా రాత్రి నిల్వ ఉంచిన అన్నాన్ని.. మధ్యాహ్నం, రాత్రి మాత్రం వేడి ఆహారపదార్ధాలను తినడానికి ఇష్టపడేవారు. అయితే ఇప్పుడు అన్ని మారిపోయాయి. అందులో ఒకటి ఆహారపు అలవాట్లు. వండిన ఆహారం నిల్వ ఉంటె చాలు....

నిల్వ ఉంటాయని.. వీటిని ఫ్రిడ్జి లో పెడుతున్నారా... అవి విషం కంటే ప్రమాదమట..అవేంటో తెలుసుకోండి..!
Never Store In The Fridge
Surya Kala
|

Updated on: Apr 05, 2021 | 6:06 PM

Share

Dont Keep These Items in Fridge: పూర్వకాలంలో ఉదయం టిఫిన్ గా రాత్రి నిల్వ ఉంచిన అన్నాన్ని.. మధ్యాహ్నం, రాత్రి మాత్రం వేడి ఆహారపదార్ధాలను తినడానికి ఇష్టపడేవారు. అయితే ఇప్పుడు అన్ని మారిపోయాయి. అందులో ఒకటి ఆహారపు అలవాట్లు. వండిన ఆహారం నిల్వ ఉంటె చాలు.. వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. కూరగాయలు, నీళ్లు,పాలు, పండ్లు ఇలా ఒక్కటేమిటి.. ఇది అది అని లేదు.. అన్నింటిని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలం వస్తే.. చల్లదనం కోసం అంటూ అవసరం ఉన్నా లేకున్నా ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత తింటున్నారు. అయితే కొన్నింటిని అసలు ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని.. అలా పెట్టి తింటే ఆరోగ్య సమస్యలు తప్పని అంటున్నారు పోషకాహార నిపుణులు.

అవేంటో తెలుసుకుందాం: 

*వేసవి లో దాహార్తిని తీర్చడానికి ఎక్కువమంది ఇష్టంగా తినేది పుచ్చకాయలు.. బయటకు వెళ్తే.. రెండు మూడు తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. అయితే పుచ్చకాయలో కొంచెం తిని.. మిగిలింది అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు.. అలా పెట్టిన పుచ్చకాయ ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. అందుకని కోయని పుచ్చకాయలను మాత్రమే చల్లదనం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకోమని సూచిస్తున్నారు. *ఉల్లి పాయలు కూర కోసం కోసినవి ఎక్కువ అయితే వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం.. అది అసలు మంచిది కాదని చెబుతున్నారు. అంతేకాదు ఫ్రిడ్జ్ లో ఉల్లిపాయలు పెట్టడం వల్ల అందులో ఉండే ఇతర ఆహార పదార్ధాలకు కూడా ఉల్లి స్మెల్ పడుతుంది. *స్వచ్ఛమైన తేనే ఎన్ని ఏళ్ళైనా చెడిపోదు.. ఇక దీనిని ఫ్రిడ్జ్ లో ఉంచితే మారుతుంది. కనుక తేనెని ఇంట్లోనే భద్రమైన ప్లేస్ లో పెట్టుకుంటే చాలు *అరటి పండ్లని ఫ్రిడ్జ్ లో పెడితే త్వరగా పాడైపోతాయి. అంతేకాదు అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి. *మల్లి, లిల్లీ వంటి పువ్వులని అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు , వీటి వాసన వల్ల ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహారాల పైన ప్రభావం పడుతుంది, ఆ పుల వాసనతో ఇతర ఆహారాలని మనం తినలేం. * కాలానుగుణంగా పెట్టుకునే పచ్చళ్ళను ఎక్కువగా ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. అలా పెట్టడం వల్ల చల్లదనానికి తేమను మరింత త్వరగా ఊరగాయలు పాడైపోతాయి. *బంగాళాదుంపలు సహజంగానే ఎక్కడ పెట్టినా నిల్వ ఉంటాయి. అయితే వాటిని కూడా కొంతమంది నిల్వ కోసం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. అలా చేయడం తో బంగాళా దుంపల్లో చక్కెర శాతం ఎక్కువగా పెరుగుతుంది. ఇక కూర టేస్ట్ కూడా మారిపోతుంది. కనుక ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని సూచిస్తున్నారు.

Also Read: ఏడాది పాటు నిల్వ ఉండే రుచికరమైన సగ్గు బియ్యం వడియాల తయారీ తెలుసుకుందాం..!

లాక్ డౌన్ సమయంలో బామ్మ మనవరాలు స్వీట్స్ వ్యాపారం.. 8 నెలల్లో లక్షల్లో సంపాదన..