అయోధ్య వివాదంలో ఇకపై రోజువారీ విచారణ.. సుప్రీం నిర్ణయం

అయోధ్య రామజన్మభూమి వివాదంలో సుప్రీం కోర్టు ఇక రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ కేసులో వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలం కావడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. సుధీర్ఘకాలం ఈ కేసును కొనసాగించకుండా ఉండేందుకు ఈనెల 6 నుంచి రోజువారీ విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది. రామజన్మభూమి వివాదంలో మధ్యవర్తిత్వం కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కైఫుల్లా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో మధ్యవర్తిత్వ కమిటీని గతంలో కోర్టు […]

అయోధ్య వివాదంలో ఇకపై రోజువారీ విచారణ.. సుప్రీం నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 8:17 AM

అయోధ్య రామజన్మభూమి వివాదంలో సుప్రీం కోర్టు ఇక రోజువారీ విచారణ చేయాలని నిర్ణయించింది. ఈ కేసులో వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలం కావడంతో అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. సుధీర్ఘకాలం ఈ కేసును కొనసాగించకుండా ఉండేందుకు ఈనెల 6 నుంచి రోజువారీ విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది.

రామజన్మభూమి వివాదంలో మధ్యవర్తిత్వం కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కైఫుల్లా నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో మధ్యవర్తిత్వ కమిటీని గతంలో కోర్టు నియమించింది. ఈ కమిటీ తన నివేదికను గురువారం కోర్టుకు సమర్పించింది. ఈ కమిటీ దాదాపు నాలుగు నెలలపాటు హిందూ, ముస్లిం సంస్థలతో చర్చలు జరిపింది. పరిష్కారానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు వివరించింది.

పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని. పరిష్కారం కనుగొనేందుకు హిందూ, ముస్లిం సంస్థలు సిద్ధంగా లేవని కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ నివేదికపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం .. ఇకపై మేమే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేనందున రోజువారీ విచారణ జరపడం ద్వారా ఒక పరిష్కారాన్ని చూపుతామంటూ వ్యాఖ్యానించింది. దీనికోసం వాదనలు ముగిసేవరకు విచారణ కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఈ మేరకు పిటిషనర్లు సిద్ధంగా ఉండాలని, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది.

Latest Articles
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
సెల్ఫ్ రిపేరింగ్ రోడ్లు వచ్చేస్తున్నాయ్.. గోతులు వాటంతట అవే..
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
ఫ్యామిలీతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీకి చిరంజీవి, రామ్ చరణ్..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
మీ బంధం బ్రేకప్ దిశగా పయనిస్తుందా? ఈ సంకేతాలను గమనిస్తే మీ బంధం..
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే.!
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ధోనీ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్.. ఐపీఎల్ హిస్టరీలోనే
బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
బాబోయ్‌.. మహిళ ముక్కులో వందల పురుగులు! ఖంగు తిన్న వైద్యులు
మోదీ పర్యటనతో బీజేపీలో ఫుల్ జోష్..
మోదీ పర్యటనతో బీజేపీలో ఫుల్ జోష్..
బ్రౌన్ బ్రెడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
బ్రౌన్ బ్రెడ్‌తో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..
యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఎలా వాడాలో తెలుసా..
యూట్యూబ్‌లో కొత్త ఏఐ ఫీచర్లు.. ఎలా వాడాలో తెలుసా..