AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ లో అవికాగోర్ కు అదిరిపోయే ఆఫర్.. ఆ సినిమాలో మూడో హీరోయిన్ గా ఛాన్స్

ఉయ్యల జంపాల సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కుర్రది అవికాగోర్. చిన్నారి పెళ్లికూతురు సినిమాతో ఆకట్టుకున్న అవికా మొదటిసినిమా తోనే మంచి మార్కును కొట్టేసింది.

టాలీవుడ్ లో అవికాగోర్ కు అదిరిపోయే ఆఫర్.. ఆ సినిమాలో మూడో హీరోయిన్ గా ఛాన్స్
Rajeev Rayala
|

Updated on: Dec 23, 2020 | 5:02 PM

Share

ఉయ్యల జంపాల సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కుర్రది అవికాగోర్. చిన్నారి పెళ్లికూతురు సినిమాతో ఆకట్టుకున్న అవికా మొదటిసినిమా తోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమా తర్వాత రాజ్ తరుణ్ సరసన సినిమా చూపిస్తా మామ సినిమాతో మరో హిట్ అందుకుంది. అ తర్వత యంగ్ హీరో నిఖిల్ కు జోడీగా ఎక్కడికుపోతావు చిన్నవాడ సినిమాలో నటించింది. అ తర్వత కొన్ని సినిమాల్లో నటించినా అవి పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. ఆ సమయంలోనే ఈ బ్యూటీ బరువుకూడ పెరగడంతో సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. చివరిగా ఈ అమ్మడు రాజుగారి గది3 లో కనిపించింది. ఈసినిమా ఫ్లాప్ అవ్వడంతో బాలివుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది. ఇప్పుడు అవికాకు అదిరిపోయే ఆఫర్ అందినట్టు తెలుస్తుంది.

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సరసన అవికాకు చాన్స్ వచ్చిందని తెలుస్తుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు థ్యాంక్యూ అనే ఇంట్రస్టిగ్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని తెలుస్తుంది. అందులో ఓ హీరోయిన్ గా అవికా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది.ఇప్పటికే ప్రియాంక అరుల్ మోహన్ , రకుల ప్రీత్ సింగ్ తోపాటు మూడో హీరోయిన్ గా అవికా ఎంపిక చేశారని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో అవికా జాయిన్ అవుతుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో అవికా కెరియర్ ఊపందుకుంటుందెమో చూడాలి.