షాకింగ్, ఆస్ట్రేలియా పార్లమెంటులో మహిళ రేప్, బాధితురాలికి క్షమాపణ చెప్పిన ప్రధాని మారిసన్

ఆస్ట్రేలియాలో కనీవినీ ఘటన జరిగింది. పార్లమెంటులో ఓ వ్యక్తి తనను రేప్ చేశాడని ఓ మహిళ ఆరోపించింది. రక్షణ మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో 2019 మార్చిలో పేరు తెలియని..

షాకింగ్, ఆస్ట్రేలియా పార్లమెంటులో మహిళ రేప్, బాధితురాలికి క్షమాపణ చెప్పిన ప్రధాని మారిసన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 16, 2021 | 11:05 AM

ఆస్ట్రేలియాలో కనీవినీ ఘటన జరిగింది. పార్లమెంటులో ఓ వ్యక్తి తనను రేప్ చేశాడని ఓ మహిళ ఆరోపించింది. రక్షణ మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో 2019 మార్చిలో పేరు తెలియని సహచర ఎంపీ ఒకరు తనపై అత్యాచారం చేశాడని, అదే ఏడాది ఏప్రిల్ లో తను పోలీసులతో ఈ విషయమై మాట్లాడానని, అయితే తన కెరీర్ కి భంగం కలుగుతుందని భావించి ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపింది. పోలీసులు కూడా ఈ విషయాన్నీ ధృవీకరించారు. ప్రధాని మారిసన్ అధికార లిబరల్ పార్టీకి చెందిన ఆ ‘రేపిస్టు’ పేరును మాత్రం ఆమె చెప్పలేదు. కాగా దీనిపై స్పందించినప్రధాని స్కాట్ మారిసన్ ఆమెకు అపాలజీ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. పార్లమెంటు వంటి చోట్ల, ఇతర ప్రాంతాల్లో మహిళల భద్రత, రక్షణకు తాము చర్యలు తీసుకుంటామన్నారు. వర్క్ ప్లేస్ లో వచ్ఛే ఈ విధమైన ఫిర్యాదుల సమీక్షకు ప్రధానమంత్రి కార్యాలయం లో  కేబినెట్ అధికారి అయిన స్టెఫానీ ఫాస్టర్ ఇక పై విచారిస్తారన్నారు. జరిగిన ఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.

కాగా మారిసన్ నేతృత్వంలోని లిబరల్ పార్టీలో పలువురు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారని అనేకమంది మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విధమైన ఆరోపణలు గతంలో చాలా వచ్చాయి.

Read More:

విజయవాడలో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక సూసైడ్ కేసు కీలకమలుపు, డాక్టర్ నవీన్ అరెస్ట్

Strain New Symptoms: కొత్త స్ట్రెయిన్ వైరస్ ఏడు కొత్త లక్షణాలు.. ఏ రెండు కనిపించినా జాగ్రత్తలు తప్పని సరంటున్న నిపుణులు