AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆదిపురుష్’లో కోలీవుడ్ యంగ్ హీరో.. ప్రభాస్ తమ్ముడిగా ఛాన్స్ దక్కించుకున్న అథర్వ

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనితోపాటు 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో 'సలార్' అనే సినిమా చేస్తున్నాడు.

'ఆదిపురుష్'లో కోలీవుడ్ యంగ్ హీరో.. ప్రభాస్ తమ్ముడిగా ఛాన్స్ దక్కించుకున్న అథర్వ
Rajeev Rayala
|

Updated on: Dec 08, 2020 | 1:48 PM

Share

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనితోపాటు ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తుంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ‘ఆదిపురుష్’ అనే సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో లంకేశ్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ను ఎంపిక చేశారు. ఇక ఈ మూవీలో ప్రభాస్ తమ్ముడు లక్ష్మణ్ గా నటించే హీరో పై గతకొద్ది రోజులుగా చర్చ జరుగుతుంది. మొదట్లో ఓ బాలీవుడ్ నటుడి పేరు వినిపించింది. తాజాగా కోలీవుడ్ నటుడి పేరు తెర పైకి వచ్చింది. తమిళ్ యంగ్ హీరో అథర్వను ప్రభాస్ తమ్ముడి పాత్రకు ఎంపిక చేసారని అంటున్నారు. అథర్వ వరుణ్ తేజ్ నటించిన ‘గద్దల కొండ గణేష్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అంతకు ముందు అథర్వ నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకూడా డబ్ అయ్యాయి. ఇప్పుడు యంగ్ హీరోకు ఆదిపురుష్ లో ఆఫర్ వచ్చినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కు తమ్ముడిగా అథర్వ సెట్ అవుతాడని భావించిన దర్శకనిర్మాతలు అతడిని సంప్రదించారని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

Follow Us
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం