OTT వైపు చిన్న నిర్మాతల చూపు..!

|

Jun 04, 2020 | 2:59 PM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఈ క్రమంలో సినిమా థియేటర్లు ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశాలు కనిపించకపోవడంతో OTTలలో సినిమాలను విడుదల చేసేందుకు..

OTT వైపు చిన్న నిర్మాతల చూపు..!
Follow us on

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ఈ క్రమంలో సినిమా థియేటర్లు ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశాలు కనిపించకపోవడంతో OTTలలో సినిమాలను విడుదల చేసేందుకు టాలీవుడ్‌లోని చిన్న నిర్మాతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చి ఫైనాన్షియర్ల నుంచి వడ్డీకి అప్పు తెచ్చుకున్న చిన్న నిర్మాతలకు ఇప్పుడిదే మార్గమని బన్నీ వాసు తెలిపారు.

అయితే భారీగా డబ్బులు ఖర్చుపెట్టి సినిమాలు తీసిన బడా నిర్మాతలు మాత్రం థియేటర్లు తెరిచేదాకా ఎదురు చూసే ధోరణిలో ఉన్నారన్నారు. భారీ వ్యయంతో తెరకెక్కించిన సినిమాలను డైరెక్ట్ OTTలలో విడుదల చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని.. OTTలకు ఉన్న బడ్జెట్ పరిమితులతో భారీ సినిమాల కొనుగోలు అసాధ్యమన్నారు. అంతేకాకుండా డిజిటల్ రిలీజ్ వల్ల ఎలాంటి రికవరీ కాదని పెద్ద నిర్మాతలు భావిస్తున్నారు. ఆలస్యమైన కూడా తమకు థియేటర్ రిలీజే మార్గమని చెబుతున్నారు.

Also Read:

నార్త్ కొరియాలో యుద్ధ మేఘాలు.. కిమ్ ఆదేశమే లేటు..!

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భూములకు ‘భూధార్’..

అప్పటివరకు సిటీ బస్సు సర్వీసులు లేనట్లే..!