దేశ ద్రోహులకు కిమ్ వార్నింగ్.. యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరికలు.!

కిమ్ యో జోంగ్.. సరిహద్దుల్లో చేసే దొంగచాటు యవ్వారాలు ఆపకపోతే.. తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని దక్షిణ కొరియాను బెదిరించినట్లు అక్కడి అధికారిక కెసిఎన్ఎ వార్తా సంస్థ వెల్లడించింది.

దేశ ద్రోహులకు కిమ్ వార్నింగ్.. యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరికలు.!
Follow us

|

Updated on: Jun 04, 2020 | 4:12 PM

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. అన్న లక్షణాలన్నింటిని చిన్నప్పటి నుంచే వంట పట్టించుకున్న కిమ్ యో జోంగ్ తాజాగా దక్షిణ కొరియాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దుల్లో ప్యోంగ్యాంగ్ వ్యతిరేక కరపత్రాలను ఎగరవేయకుండా సియోల్ తన కార్యకర్తలను ఆపకపోతే.. దక్షిణ కొరియాతో ఉన్న సైనిక ఒప్పందాన్ని రద్దు చేసి.. సరిహద్దు సంబంధ కార్యాలయాన్ని మూసివేస్తామని ఆమె హెచ్చరించారు.

కిమ్‌ను కించపరిచే విధంగా పలు కరపత్రాలతో ఉత్తర కొరియా ఫిరాయింపుదారులు, సియాల్ కార్యకర్తలు కొద్దిరోజులుగా నార్త్ కొరియా సరిహద్దు మీదుగా బెలూన్‌లను ఎగరవేస్తున్నారు. ఈ విషయంపై దక్షిణ కొరియా చాలా సాకులే చెబుతూ వచ్చింది. అయితే వాటన్నింటితో విసిగిపోయిన కిమ్ యో జోంగ్.. సరిహద్దుల్లో చేసే దొంగచాటు యవ్వారాలు ఆపకపోతే.. తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని దక్షిణ కొరియాను బెదిరించినట్లు అక్కడి అధికారిక కెసిఎన్ఎ వార్తా సంస్థ వెల్లడించింది.

తమ మాతృభూమికి ద్రోహం చేసిన ఫిరాయింపుదారులు మొరిగే కుక్కలతో సమానం అని.. ఇప్పుడు వారి యజమానుల గురించి పట్టించుకునే సమయం వచ్చిందంటూ దక్షిణ కొరియన్లను ఉద్దేశించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018లో మూన్ ప్యోంగ్యాంగ్ పర్యటన సందర్భంగా సంతకం చేసిన సైనిక ఒప్పందాన్ని రద్దు చేస్తామని, సరిహద్దు సంబంధ కార్యాలయాన్ని మూసివేస్తామని ఆమె బెదిరించారు. ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే మాత్రమే కిమ్ యుద్ధానికి సిద్ధమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి.

Also Read:

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

వైఎస్ఆర్ వాహనమిత్ర.. వారి ఖాతాల్లోకి రూ.10 వేలు జమ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై భూములకు ‘భూధార్’..

అప్పటివరకు సిటీ బస్సు సర్వీసులు లేనట్లే..!