AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Artificial intelligence: ఆ పరికరం కరోనావైరస్‌ను క్షణాల్లో కనిపెడుతుందట…

కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. ఎవరైనా దగ్గినా తుమ్మినా జనాలు భయపడిపోతున్నారు. కరోనా లక్షణాలనే అనుమానంతో ఆస్పత్రుల్లో

Artificial intelligence: ఆ పరికరం కరోనావైరస్‌ను క్షణాల్లో కనిపెడుతుందట...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 03, 2020 | 10:38 PM

Share

Artificial intelligence (AI): కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. ఎవరైనా దగ్గినా తుమ్మినా జనాలు భయపడిపోతున్నారు. కరోనా లక్షణాలనే అనుమానంతో ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. కానీ వీరికి నిజంగా కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతోంది. అయితే ఇకపై అలాంటి అవసరం లేదంటూ ఓ వార్త వినపడుతోంది. ఎందుకంటే, చైనాకు చెందిన ఆలీబాబా సంస్థ సిద్ధం చేసిన ఏఐ(అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కరోనా వైరస్‌ను ఇట్టే పట్టేస్తుందట.

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా ఆధ్వర్యంలోని రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డామో అకాడమీలో ఈ ఏఐను అభివృద్ధి చేశారని తెలుస్తోంది. కంప్యూటరైజిడ్ టోమోగ్రఫీ స్కాన్స్(సీటీ స్కాన్స్) ద్వారా ఇది కరోనాను గుర్తిస్తుందట. అది కూడా అత్యంత వేగంగా 20 సెకన్లలోనే పేషెంట్ పరీక్ష పూర్తవుతుందని సమాచారం. ఈ పరీక్షా ఫలితాలు 96శాతం కచ్చితత్వంతో ఉంటాయని అంటున్నారు. దాదాపు 5వేలమంది కరోనా బాధితుల డేటాతో ఈ ఏఐ మోడల్‌కు శిక్షణ ఇచ్చినట్లు పరిశోధకులు చెప్పారట.

మరోవైపు, చైనాకే చెందిన హెల్త్‌కేర్ కంపెనీ పింగ్ ఆన్.. కూడా కరోనాను కనిపెట్టే ఓ పరికరాన్ని తయారు చేసిందట. దీని గురించి ఆ సంస్థ సహాధ్యక్షుడు మాట్లాడుతూ.. తమ పరికరం 15 సెకన్లలోనే కరోనా కేసులను పట్టేస్తుందని, ఫలితాలు 90శాతం కచ్చితత్వంతో ఉంటాయని ప్రకటించారు.

Follow Us
విజయకీలాద్రిపై అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ..!
విజయకీలాద్రిపై అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ..!
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
ఖరీదైన క్రీములు లేకుండా నేచురల్ గ్లో.. శ్రద్ధాను చూసి నేర్చుకోండి
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
మరో దేశంపై గురి పెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
ఇల్లు పిల్లలదే.. వచ్చి వెళ్లేది పేరెంట్స్ మాత్రమే! కొత్త ట్రెండ్
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
జీర్ణ సమస్యలకు చెక్.. చర్మ వ్యాధులకు విరుగుడు! తాటి ముంజల పొట్టు
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
భార్య స్నేహారెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. వీడియో
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
ఖరీదైన ఫేషియల్స్ ఎందుకు? ‘తేనె’తో ఇంట్లోనే పార్లర్!
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్
వరుణ్ పై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్