కాణిపాక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు..

కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని...

కాణిపాక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు..
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 09, 2020 | 12:45 AM

Arrangements for Brahmotsavam at Kanipakam Temple : కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో ఎలాంటి హంగు ఆర్బాటం లేకుండా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 11 వరకు కాణిపాకం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.

కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని ఆలయ ఉద్యోగులకు ఆయన ఆదేశించారు. ప్రతిరోజు స్వామివారికి పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించాలని సూచించారు. గ్రామోత్సవంను నిలిపివేసి ఆలయ ప్రాకారంలోని వాహన సేవలు నిర్వహించాలని ఆయన చెప్పారు.

చవితి రోజు మాత్రం మూడు వేల నుంచి నాలుగు వేల మందికి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. 60 ఏళ్ళు పైబడి 10 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలకు దర్శనం కోసం రావద్దని కోరారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో దర్శనం టికెట్లు విక్రయించాలని కలెక్టర్ ఆదేశించారు.